YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

రిటైర్డ్‌ వీఆర్వోల పింఛన్‌ గోస

Highlights

  • తొమ్మిదేళ్లుగా ఎదురుచూపులు
  • ఉమ్మడి రాష్ట్రంలో అంగీకారం
  • ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌ 
  • తెలంగాణలో అందడం లేదు
  • అధికారుల నిర్లక్ష్యమే
  • ముఖ్యమంత్రి చొరవ చూపాలి
రిటైర్డ్‌ వీఆర్వోల పింఛన్‌ గోస

విలేజి రెవెన్యూ ఆఫీసుర్లు(వీఆర్వో)  రెవెన్యూశాఖలో  దశాబ్దాల పాటు పని చేశా రు. తొమ్మిదేళ్ల క్రితం పదవి విరమణ చెందారు.ఆనాటి నుంచి వారికి పింఛన్‌ ఇచ్చేందుకు నిబంధనలు అడ్డొచ్చాయి. ఉన్నతాధికారుల పట్టింపులేనితనం వారి పాలిట శాపంగా పరిణమించింది. వీరికి పింఛన్‌ ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినప్పటికీ  జీవో రాకపోవడంతో అమలుకు నోచుకోలేదు. ఫలితంగా తెలంగాణ పరిధిలోని 492 మంది రిటైర్డ్‌ వీ ఆర్వోలు పింఛన్‌ అందక వృద్ధాప్యంలో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పటేల్‌, పట్వారీ వ్యవస్థలో భాగంగానే 1984 ముందు వరకు గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల నిర్వహణ కొనసాగేది. ఎన్ టీ రామారావు ప్రభుత్వం వచ్చాక ఆ వ్యవస్థను రద్దు చేసింది. అర్హతలున్న వారికి ఉద్యోగావకాశం కల్పించాలని కోరుతూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచనతో 1992లో తాత్కాలిక ప్రాతిపదికన వీఏవో(విలేజ్‌ అసిస్టెంట్‌ ఆఫీసర్‌)లుగా అప్పటి ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత వీరిలో అర్హతలున్న వారిని 2002 జనవరి 1 నుంచి పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా నియమిస్తూ పేస్కేల్‌ మంజూరు చేసింది. కొందరు వీఆర్వోలుగా, మరికొందరు పంచాయతీ కార్యదర్శులుగా నియమితులయ్యారు.
రాష్ట్రంలో  2008 జూన్‌ 30వ తేదీలోపు 2,225 మంది ఉద్యోగ విరమణ పొందారు. పింఛన్‌ పొందేందుకు ఏడేళ్ల రెగ్యులర్‌ సర్వీసు ఉండాలన్న నిబంధన అడ్డురావడంతో వీరికి పింఛన్‌ మంజూరు కాలేదు. వీఏవోలుగా పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని తమకు పింఛన్‌ ఇవ్వాలంటూ వారంతా ఏపీ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రై బ్యునల్‌ను ఆశ్రయించారు. అక్కడ వారికి సానుకూల తీర్పు వచ్చింది. అప్పటి సీఎం నల్లారి.కిరణ్‌కుమార్‌రెడ్డి పింఛన్‌ మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపారు. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉండడం, ఎన్నికలు సమీపించడంతో సదరు ఆదేశాలు అమలుకు నోచుకోలేదు.

అధికారుల నిర్లక్ష్యమే..?

ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రిటైర్డ్‌ వీఆర్వోలకు పింఛన్‌ సదుపాయం కల్పిస్తూ 2014 నవంబర్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో 388 విడుదల చేసింది. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1,733 మంది పింఛన్‌ అందుకుంటున్నారు. తెలంగాణలో మా త్రం అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగ విరమణ పొందిన 492 మంది తొమ్మిదేళ్లుగా పింఛన్‌ అందుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ శాఖలోని ఉన్నతాధికారుల పట్టింపులేనితనమే ఈ పరిస్థితికి కారణమని, ఇప్పటికైనా ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ముఖ్యమంత్రి చొరవ చూపాలి
సీఎం కేసీఆర్‌ మా సమస్యపై దృష్టి సారించాలని రిటైర్డ్‌ వీఆర్వోల ప్రతినిధులు నరసింహారావు, మోహనరావులు .కోరుతున్నారు. అందరికీ అన్నీ ఇస్తున్నతమ దృష్టికి మా సమస్య వెళ్లలేదని భావిస్తున్నమని annaaru. ఇప్పటికైనా తమ విషయంలో పెద్ద మనస్సుతో జోక్యం చేసుకుని తమకు పింఛన్‌ సదుపాయం కల్పించాలని రిటైర్డ్‌ వీఆర్వోలు నరసింహారావు, మోహనరావులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Related Posts