యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రవాణా శాఖ ఆదాయం పెరిగింది. వాహన రిజిస్ట్రేషన్లలోనూ పెరుగుదల నమోదైంది. రవాణా శాఖ నివేదికలు ఈ వివరాలను స్పష్టం చేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోని మూడు త్రైమాసికాలకు కలిపి రూ.2291.15 కోట్లు ఆదాయం రవాణా శాఖకు రాగా ఈ ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాలకు రూ.2505.09 కోట్ల ఆదాయం సమకూరింది. 9.34 శాతం వృద్ధిని సాధించింది. గత ఆర్థిక సంవత్సంలో లైఫ్ ట్యాక్సుల రూపంలో రూ.1020.63 రాగా ఈ ఏడాది రూ.1155.92 కోట్లు, త్రైమాసిక ట్యాక్సుల రూపంలో గతేడాది రూ.575.55 కోట్లు రాగా ఈ ఏడాది రూ.606.88 కోట్లు, ఫీజుల రూపంలో గతేడాది 404.30 కోట్లు రాగా ఈ ఏడాది రూ.407.44 కోట్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ రూపంలో గతేడాది రూ.213.56 కోట్లు రాగా ఈ ఏడాది రూ.255.08 కోట్లు, యూజర్ ఛార్జీల రూపంలో గతేడాది రూ.77.12 కోట్లు రాగా ఈ ఏడాది రూ.79.77 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రవాణా శాఖ ఆదాయార్జనలో కృష్ణా జిల్లా రూ.342.30 శాతంతో ప్రథమ స్థానంలో, రూ.306.89 కోట్లతో విశాఖపట్నం జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచాయి. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 7,31,648 వాహనాలు రిజిస్ట్రేషన్ అవ్వగా ఈ ఏడాది 7,78,424 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ద్విచక్రవాహనాలు గతేడాది 6,30,678 రిజిస్ట్రేషన్ కాగా ఈ ఏడాది 6,60,725, నాలుగు చక్రాల వాహనాలు గతేడాది 47,504 రిజిస్ట్రేషన్ కాగా ఈ ఏడాది 49,721, సరుకు రవాణా వాహనాలు గతేడాది 28,231 రిజిస్ట్రేషన్ కాగా ఈ ఏడాది 32,564, ప్యాసింజర్ వాహనాలు గతేడాది 4,590 రిజిస్ట్రేషన్ కాగా ఈ ఏడాది 6,617, ఆటోలు గతేడాది 20,645 రిజిస్ట్రేషన్ కాగా ఈ ఏడాది 28,797 రిజిస్ట్రేషన్ అయ్యాయి