యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అమరావతి రాజధాని ప్రాంతం వెంకటాయపాలెంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తదనంతరం మహాపూర్ణాహుతి, వేదాశీర్వచనం నిర్వహించారు ఈ సందర్బంగా అయన యాగశాల నుంచి నాగలి తో తరలి వెళ్లారు. రెండు జోడేద్దు లతో దక్కిన అనంతరం భూకర్షణం , బీజావాపనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, పరిటాల సునీత,టీటీడీ ఈవో ఏకే సింఘల్ తదితరులు పాల్గోన్నారు. తరువాత ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో శ్రీవారి ఆలయం నిర్మాణం ఒక చరిత్ర అని అన్నారు వేంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో ఉండటం మన అందరి అదృష్టమన్నారు. వేంకటేశ్వరుని దివ్యక్షేత్రం అమరావతిలో రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. అమరావతి రెండుసార్లు రాజధానిగా నిలబడిందన్నారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పవిత్రమైన మట్టి, జలాలు తీసుకొచ్చి ఈ నేలలో పునీతం చేశామన్నారు. తిరుపతి, తిరుమల నుంచే కాకుండా ఇక్కడ కూడా ప్రజలకు ఆశీర్వాదం అందడం శుభకరమన్నారు.