YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ధర్మపోరాటానికి సిద్దం కావాలి

ధర్మపోరాటానికి సిద్దం కావాలి
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
గవర్నర్ ప్రసంగం నాలుగేళ్ల అభివృద్ధిని ప్రతిబింబించింది. పేదలకు చేసిన సంక్షేమానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనం.దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం అయన టిడిపి నేతలు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ గ్రామగ్రామానా ప్రచారం చేయాలి. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రంలో బిజెపి చేసిన అన్యాయాన్ని వివరించాలి. ఢిల్లీలో ధర్మపోరాటానికి అందరూ సిద్ధం కావాలి.  పార్లమెంటులో పోరాటాన్ని మన ఎంపిలు మరింత ఉధృతం. ఢిల్లీ దీక్షకు ఇప్పటినుంచే సమాయత్తం కావాలి. ఫిబ్రవరి 1న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు. నల్లబ్యాడ్జీలతో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు జరపాలి. ప్రజల మనోభావాల ప్రకారమే తెలుగుదేశం. ప్రజా సాధికారతే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. తిరుగులేని శక్తిగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలి. అందుకు కావాల్సిన పునాదులు వేస్తున్నాం. ఏపి నిలదొక్కుకుంది అంటే తెలుగుదేశం వల్లే. ప్రతి కార్యకర్తకు,నాయకుడికి గర్వ కారణమని అన్నారు. టిడిపి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. ఈ అభివృద్ధి పదికాలాలు కొనసాగుతుంది. తెలుగుదేశం రాకపోతే రాష్ట్రంలో అరాచకం. టిడిపి రాకపోతే రాష్ట్ర భవిష్యత్ అంధకారం.  రైతులు,మహిళలు,యువతలో ఇదే భావన. బీసి,ఎస్సీ,ఎస్టీ,ముస్లిం,మైనారిటీల్లో ఇదే భావన అని అన్నారు. మహిళలు,రైతులు,పెన్షనర్లు టిడిపికి అండదండ.  అన్నివర్గాల మద్దతు టిడిపికి ఏకపక్షం కావాలని అయన అన్నారు.  60 ఏళ్ల నష్టం పూడ్చడానికి 15ఏళ్లు పడుతుంది. 5ఏళ్లలో ఇంత అభివృద్ధి,సంక్షేమం సాధించాం. హైదరాబాద్ లాంటి నగరం నిర్మించడానికి 20ఏళ్లు. రూ.5లక్షలు కావాలని విభజనకు ముందే డిమాండ్ చేశామని అన్నారు. అటు కెసిఆర్,ఇటు జగన్ ఏపికి నష్టం చేస్తున్నారు. నరేంద్రమోది వాళ్లను ప్రోత్సహిస్తున్నారు. మూడుపార్టీలు లాలూచిపడి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అసమర్ధ పాలనకు కేంద్రంలో బిజెపియే రుజువు. చేతకానితనానికి నరేంద్ర మోది నిదర్శనం.  మోది చేతకానితనం ప్రజలకు శాపం అయ్యింది. అన్నాహజారే మళ్లీ దీక్ష చేసే దుస్థితి వచ్చింది. లోక్ పాల్ ను నియమిస్తామని చెప్పి మోదీ మోసం. ఆంధ్రప్రదేశ్ నే కాదు అన్నాహజారేను బిజెపి మోసం చేసింది. సీబిఐ, ఆర్ బిఐ స్వయంప్రతిపత్తిని దెబ్బతీశారు. ఇప్పుడు గణాంకాల కమిషన్ కు, సెబి కి తూట్లు. అన్ని వ్యవస్థలు కుంటుపడేలా ప్రధాని మోది నిర్వాకాలున్నాయని అయన అన్నారు. రాష్ట్రంలో 54 లక్షల పించన్ దార్లు టిడిపికి అండగా ఉన్నారు.  రాబోయే ఎన్నికలు ఏకపక్షం అనడానికి ఇదే రుజువని చంద్రబాబు నాయుడు అన్నారు.

Related Posts