యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
ఇప్పటివరకూ ఏకఛత్రాధిపత్యంగా సిరీస్‌ని జయించిన టీం ఇండియా నాలుగో వన్డేలో మాత్రం డీలాపడిపోయింది. గురువారం హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్దేశించిన 93 పరుగుల లక్ష్యాన్ని కివీస్ అలవోకగా సాధించింది. తొలుత టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. ట్రెంట్ బౌల్డ్ బంతితో వీర విహారం చేయడంతో భారత్ అత్యల్ప స్కోర్‌కే ఆలౌట్ అయింది. ఫలితంగా టీం ఇండియా వన్డే చరిత్రలో అత్యల్ప స్కోర్ నేడు మరోసారి నమోదైంది. అయితే టీమిండియాను 92 పరుగులకే ఆలౌట్ చేసిన అనంతరం కివీస్ బ్యాటింగ్‌కు దిగింది. 15 ఓవర్లు కూడా పూర్తి చేయకుండానే రెండు వికెట్ల నష్టానికి కివీస్ 93 లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రెంట్ బౌల్ట్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాన్’గా నిలిచాడు.