యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
విశాఖలో మరో అవినీతి అధికారి ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న సమాచారంతో మైన్స్ అండ్ జియాలజీ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ గోండు శివాజీ ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున 6 గంటల నుండి దాడులు కొనసాగాయి. ఏక కాలం లో ఆరు చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు జరిపారు. విశాఖ నగరంలోని ఎంవిపి కాలనీ లోని గోండు శివాజీ ఇంటిలో జరిపిన సోదాల్లో ఆరు లక్షల రూపాయల నగదు, పావు కిలో బంగారం, రెండు బ్యాంకు లాకర్లను స్వాధీనపరచుకున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాలలో పనిచేసిన శివాజీ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడి భారీగా అక్రమార్జన చేసినట్టు అధికారులకు అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిపారు. భోగాపురం మండలం , బంటుపల్లి గ్రామానికి చెందిన శివాజీ చిరుద్యోగిగా మొదలై, అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి ఎది గారు.
1992 డిపార్ట్ మెంట్ లోకి వచ్చిన శివాజీ విజయనగరం విశాఖపట్నం రాజమండ్రి తదితర ప్రాంతాల్లో విజిలెన్స్ ఎడి గా పని చేశారు. 2013 నుండి 2015 వరకు అనకాపల్లి మైండ్ ఏడి గా పని చేశారు తరువాత విజిలెన్స్ ఏ డి గా పనిచేస్తూ మరలా తిరిగి 2018 అక్టోబరు నుండి అనకాపల్లి ఏ డి గా బాధ్యతలు స్వీకరించారు. వివాదాస్పద వ్యక్తిగా పేరుపొందిన శివాజీపై గతంలో అనేక పిర్యాదులు వచ్చాయి.