యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఇచ్చిన ఒక్క హామీ అమలుచేయకుండా ఇప్పుడు కొత్త హామీలు ఇస్తున్నారు. రైతు దంపతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగంలో రైతు ఆత్మహత్యలు లేవని చెప్పించడం దారుణమని వైకాపా రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎకరాకు 2500 ఇస్తాను అంటున్నారు, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త డ్రామా ప్రారంభించారని అన్నారు. రుణమాఫీ ఇంకా పూర్తిగా చెల్లించలేదు, ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించలేదు. లక్షలాది ఎకరాల్లో సాగు తగ్గింది. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు. జగన్ రైతులకు ఇచ్చిన హామీలు చంద్రబాబు ఫాలో అవుతున్నారని అయన అన్నారు. జగన్ నవరత్నాలు లో రైతులకు ఏం చేయబోతున్న విషయం హామీ ఇచ్చారు. జగన్ ప్రకటించిన రోజు సాధ్యం కాని హామీలు అన్న చంద్రబాబు ఇప్పుడు అవే అమలుచేస్తున్నారు. చంద్రబాబు ఇప్పటి 5 ఏళ్ళ పాలనే అందిస్తాను అని ఎన్నికలకి వెళ్లే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రైతు కంట కన్నీరు మంచిది కాదని అయన అన్నారు.