YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

రాజస్థాన్‌లో ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయభేరి

రాజస్థాన్‌లో ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయభేరి
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీ మరోసారి జయభేరి మోగించింది. రామ్‌గఢ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి షఫియా జుబేర్‌ 12వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జుబేర్‌కు 83,311 ఓట్లు రాగా.. సమీప భాజపా అభ్యర్థి సువంత్‌ సింగ్‌కు 71,083 ఓట్లు వచ్చాయి. ఈ విజయంతో 200 శాసనసభ స్థానాలున్న రాజస్థాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ సంఖ్యాబలం 100కు పెరిగింది.గతేడాది డిసెంబరు 7న రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే అప్పుడు రామ్‌గఢ్‌లో బీఎస్పీ అభ్యర్థి మృతితో ఆ నియోజకవర్గంలో ఎన్నిక వాయిదా వేసి తిరిగి జనవరి 27న ఎన్నికలు నిర్వహించారు. గురువారం ఓట్ల లెక్కింపు చేపట్టగా కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్‌ 99 సీట్లు సాధించింది. భాజపాకు 73 సీట్లు వచ్చాయి. అయితే ఒక స్థానంలో గెలిచిన ఆర్‌ఎల్‌డీ మద్దతుతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.ఇక హరియాణాలోని జింద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాజపా ముందంజలో ఉంది. జింద్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే హరి చంద్‌ మిద్దా మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించారు. భాజపా నుంచి హరిచంద్‌ కుమారుడు కృష్ణ మిద్దా బరిలోకి దిగగా.. కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా, జననాయక్‌ జనతా పార్టీ నుంచి దిగ్విజయ్‌ చౌతాలా పోటీ చేశారు. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టగా భాజపా అభ్యర్థి కృష్ణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దిగ్విజయ్‌ చౌతాలా రెండో స్థానంలో ఉండగా.. రణ్‌దీప్‌ సుర్జేవాలా మూడో స్థానానికి పడిపోయారు.

Related Posts