యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అమరావతి లో టీడీఎల్పీ భేటీ ముగిసింది. పార్టీ ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశనం చేసారు. చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే నెల 11న ఢిల్లీ దీక్షకు ఎమ్మెల్యేలు అంతా హాజరు కావాలి. 12న రాష్ట్రపతిని కలుద్దామని అన్నారు. శుక్రవారం నాడు నల్ల చొక్కాలతో సభకు హాజరు కావాలని నేతలను అయన ఆదేశించారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి అభ్యర్దుల ఎంపిక పూర్తి చేయాల్సి ఉందన్న చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. 30 రోజుల పాటు పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారం చేస్తానని స్పష్టం చేసారు. రోజుకు రెండు జిల్లాలు తిరగాలా..? రోడ్ షోలు నిర్వహించాలా..? బస్సు యాత్ర చేపట్టాలా..? అనే అంశాలను తాను పరిశీలిస్తోన్నట్టు అయన వెల్లడించారు. చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ వెళుతున్నారు.