యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడ బస్ స్టేషన్ వద్ద శుక్రవారం ఉదయం 5 గంటల నుండి ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఐ నేతలకు కుడా పాల్గోన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు నమ్మకం విడవద్దు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చుకున్నారు. అలాగే..ప్రత్యేక హోదా కోసం మనం చేస్తున్న పోరాటమూ విజయం సాధిస్తుందని అన్నారు. గత నాలుగున్నర ఏళ్ల లో ఎన్నడూ మాతో కలవని ఏపీ ఎన్జీవోలు, అమరావతి ఐకాసలు సైతం ఈ రోజు బయటకు వచ్చాయి. కలసి రాని పార్టీలు, విభేదాలు మాని ప్రత్యేక హోదా కోసం రావాలని కోరుతున్నానని అన్నారు. మా పోరాటం కేవలం ప్రత్యేక హోదా కోసం కాదు. విభజన బిల్లులో ఏపీకి ఇస్తామన్న అన్ని హామీలు ఇచ్చితీరాలని అయన అన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరా రెడ్డి మాట్లాడుతూ ఏపీకి అన్యాయం చేసిన మోడీ కి రాష్ట్రం లో తిరిగే హక్కు లేదు. అడ్డుకుంటాం. అధికారంలోకి రాగానే మొదటి సంతకం ప్రత్యేక హోదా పైనే అన్న రాహుల్ గాంధీ ఆ మాటకు కట్టుబడే ఉన్నారని అన్నారు. గత నాలుగున్నర ఏళ్లుగా ప్రత్యేక హోదా పై కలిసి రావాలని, అఖిల పక్షాన్ని ఢిల్లీ కి తీసుకు వెళ్లాలని చంద్రబాబు కి ఎన్నో లేఖలు రాసాను.వాటికి జవాబు ఇవ్వలేదు. ఇప్పడు ఢిల్లీలో ధర్నా అంటున్నాడు. ఢిల్లీ దీక్ష లో మేము పాల్గొనడం లేదని అయన స్పష్టం చేసారు. సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ మోడీ పాలన రాజ్యాంగ విరుద్ధంగా మారింది. న్యాయం అడిగితే కేసులతో భయపెడుతున్నారు. ప్రత్యేక హోదా 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అని అన్నారు.