YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీ శైలంలో పొలిటికల్ ఫైట్

శ్రీ శైలంలో పొలిటికల్ ఫైట్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి నియోజకవర్గం నిరంతరం పర్యటనలు చేస్తున్నారు ఈసారైనా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలన్న గట్టిపట్టుదలతో ఆయన దూసుకుపోతున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఈసారి పొలిటికల్ ఫైట్ మామూలుగా ఉండేలా లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే ఈసారి పార్టీలు మారి పోటీ చేస్తుండటం విశేషం. గతంలో ఆత్మకూరు నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతం 2009లో జరిగిన నియోజకవర్గం పునర్విభజనతో శ్రీశైలం నియోజకవర్గంగా మారింది. ఆత్మకూరు నియోజకవర్గం 1978లో ఏర్పడిన ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే ఐదు సార్లు కాంగ్రెస్, మూడు సార్లు టీడీపీ, ఒకసారి వైసీపీ గెలుపు సాధించాయి. అంటే ఇక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంకు బలంగా ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది.శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోకి ఆత్మకూరు, వెలుగోడు, శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గంలోని బండి ఆత్మకూరు, మహానంది మండాలాలు ఉన్నాయి. ఇక్కడ మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉంది. గతంలో మాజీ మంత్రి బుడ్డా వెంగళరెడ్డిని ఇక్కడ మావోయిస్టులు హత్య చేశారు. ఇక దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన పావురాల గుట్ట సయితం శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. గత ఎన్నికలలో శ్రీశైలం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బుడ్డాయే విజయం సాధించారు.
తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేశారు. దీంతో అప్పట్లో నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డికి, బుడ్డా రాజశేఖర్ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయి. శిల్పాకు టీడీపీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చింది. అయితే నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా తన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరి అభ్యర్థిగా నిలబడటంతో శిల్పా చక్రపాణిరెడ్డి కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఇద్దరు నేతలు పర్యటనలతో హోరెత్తిస్తున్నారు.డ వైసీపీ ఓటు బ్యాంకు అధికం. బుడ్డా కుటుంబంలోనూ విభేదాలు తలెత్తాయి. సోదరులు బుడ్డా శేషిరెడ్డి, రాజశేఖర్ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో పాటు పార్టీ మారడం రాజశేఖర్ రెడ్డి పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువచేస్తూ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యే పైనా, ప్రభుత్వంపైన ఉన్న వ్యతిరేకతే తనను గెలిపిస్తుందన్న విశ్వాసంతో శిల్పా చక్రపాణిరెడ్డి ఉన్నారు. ఇప్పటి వరకూ జనసేన ఇక్కడ ఇన్ ఛార్జిని నియమించలేదు. శ్రీశైలంలో మాత్రం ద్విముఖ పోరే ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా. ఈసారైనా తనకు విజయం దక్కుతుందన్న ధీమాతో శిల్పా చక్రపాణిరెడ్డి ఉన్నారు.

Related Posts