YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆ ఐదు నగరాల్లో వాయుకాలుష్యమే

 ఆ ఐదు నగరాల్లో వాయుకాలుష్యమే

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ముందుగానే మేల్కొని సరైన నివారణ చర్యలు చేపట్టని పక్షంలో దేశ రాజధాని ఢిల్లీలోని వాతావరణ పరిస్థితులను చవిచూడక తప్పదు. వాయుకాలుష్యాన్ని నియంత్రించి సాధారణ పరిస్థితులు తీసుకురాని పక్షంలో ఇబ్బందులు తప్పదు. ఈ అంశాలను గమనించిన కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న పట్టణాలను గుర్తించి నియంత్రించాలంటూ రాష్ట్రాలకు సూచించింది. దీనికి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం  కార్యక్రమం కింద సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని అందించేందుకు సైతం ముందుకు వచ్చింది. ఇటీవల కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి  దేశ వ్యాప్తంగా 102 పట్టణాల్లో వాయు కాలుష్యం ప్రభావం చూపుతోందని గుర్తించింది. ఈ పట్టణాలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు వీలుగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని సూచించింది. కేంద్ర అధ్యయనంలో రాష్ట్రం నుంచి ఐదు పట్టణాల్లో వాయుకాలుష్య ప్రభావం ఉందని తేలింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు పట్టణాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నట్టు గుర్తించి, రాష్ట్రాన్ని అప్రమత్తం చేసింది. ఈ ఐదు పట్టణాలో 2011 నుంచి 2015 వరకూ సేకరించిన డేటా ప్రకారం పీపీ 2.5, పీఎం 10 పరిమాణాలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి. ఈ ఐదు పట్టణాల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇప్పటి నుంచి సరైన చర్యలు చేపట్టని పక్షంలో భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరించింది. పట్టణాల్లో వాయుకాలుష్య నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిందిగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్రానికి సూచించింది. ఈ నేపథ్యంలో గతేడాది నవంబర్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. రవాణా, పరిశ్రమలలు, వ్యయవసాయ శాఖల కమిషనర్లతో పాటు అటవీ శాఖ కార్యదర్శి సభ్యులుగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి కన్వీనర్‌గా కమిటీ ఏర్పాటైంది. తాజాగా ఈ కమిటీలో ప్రభుత్వం విశాఖపట్నం, విజయవాడ మున్సిపల్ కమిషనర్లకు స్థానం కల్పించారు. గుర్తించిన ఐదు పట్టణాల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఐదేళ్ల కాలపరిమితికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుకోవాలని కేంద్రం సూచించింది. యాక్షన్ ప్లాన్ తయారీకి కేంద్ర సెంటల్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) సహకరిస్తుంది. ప్రస్తుత సంవత్సరం నుంచి యాక్షన్ ప్లాన్ మేరకు వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. యాక్షన్ ప్లాన్ తయారీకి సీఎస్‌ఈ సహకరించడంతో పాటు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో నిధులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఇదే విషయాన్ని ఎపీ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ ఆర్ లక్ష్మినారాయణ ప్రస్తావిస్తూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఎంపిక చేసిన పట్టణాల్లో విశాఖ, విజయవాడ సహా మరో మూడు పట్టణాలు ఉన్నాయన్నారు. త్వరలోనే గుర్తించిన పట్టణాల్లో వాయు కాలుష్య నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు.

Related Posts