Highlights
- వయోపరిమితి పెంపు
- 28 నుంచి 30కి
- విరమించిన ఆందోళన
భారతీయ రైల్వేల్లో గ్రూప్ డీ పోస్టుల భర్తీ కోసం కొత్తగా తీసుకొచ్చిన వయోపరిమితి నిబంధనల్లో మార్పులు తీసుకువస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ హామీ ఇచ్చారు. గరిష్ఠ వయోపరిమితిని 28 నుంచి 30 కి పెంచనున్నామని, త్వరలోనే సవరించిన ప్రకటన జారీ చేస్తామని తెలిపారు. దాంతో గత రెండు రోజులుగా కొనసాగిన ఆందోళనలను విద్యార్థులు విరమించుకున్నారు.
గ్రూప్ డీ ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి నిబంధనల్ని మార్చాలని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో రవిశంకర్ ప్రసాద్ చర్చించి ఆ మేరకు సవరణ ప్రకటన వచ్చేలా చేయడంతో బీహార్ సహా ఉత్తరాది రాష్ర్టాల్లో సాగిన రైల్‌రోకో వంటి ఆందోళనలను విద్యార్థులు నిలిపివేశారు. 63 వేల గ్రూప్ డీ ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ ఇటీవల ప్రకటన జారీ చేసింది.