యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ అసెంబ్లీ శుక్రవారం మంత్రి అచ్చెన్నాయుడు, బీజేపీ సభ్యుడు విష్ణు కుమార్ రాజు మధ్య మాటల యుద్ధం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఎందుకు రాజీనామా చేశారు సమాధానం చెప్పాలని విష్ణు కుమార్ రాజును మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు. స్పందించిన విష్ణు కుమార్ రాజు టీడీపీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి టీడీపీకి ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలని ప్రతిసవాల్ విసిరారు. విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ ముగ్గురు ఎమ్మెల్యే లు రాజీనామా ఆమోదిస్తే సరిపోదు. 23 మంది ఎమ్మెల్యేలను ఎందుకు బైటకు పంపలేదని ప్రజలు అడుగుతున్నారని అన్నారు. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు కు తెలుసు కేంద్రం నుంచి నిధులు బాగా వచ్చాయని.. అందుకే యనమల నల్ల చొక్కా దరించలేదు. ప్రత్యేక హోదా పై జగన్ దూసుకుపోతున్న డని తెలిసి టీడీపీ యూ టర్న్ తీసుకుందని విమర్శించారు. మిత్ర ద్రోహం చేసిన పార్టీ టీడీపీ. మొన్నటి వరకు జగన్ పవన్ బీజేపీ ఒకటని విమర్శలు చేసారు. ఇప్పుడు పవన్ కళ్యాణపై ప్రేమ చూపిస్తున్నారు. పవన్ ను పక్కన పెట్టి ఎప్పుడు కేసీఆర్ ను కలుపుతున్నారు. హోదా పై టీడీపీ ఎందుకు యూ టర్న్ తీసుకుందో చెప్పాలని అయన డిమాండ్ చేసారు. వైసీపీ తరపున మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు.. వాస్తవలే చెప్తున్నాం.ఎవరెవరు ఏ పార్టీల్లోకి వెళ్తారో మూడు నెలల్లో తెలుస్తుందని అయన అన్నారు.