YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైతు వ్యవసాయం..ఓట్ల వ్యవహారం

రైతు వ్యవసాయం..ఓట్ల వ్యవహారం
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రాష్ట్రాలే కాదు..కేంద్ర ప్రభుత్వం కూడా ‘ఓట్ల వ్యవసాయం’ మొదలుపెట్టింది. ఎన్నికల్లో గెలుపునకు రైతులను నమ్ముకోవటం తప్ప మరో మార్గంలేదని నిర్ణయానికి వచ్చినట్లు ఉంది. అందరూ అదే బాట పడుతున్నారు. తెలంగాణ సర్కారు అయితే ఏడాది ముందు నుంచే రైతు బంధు పేరుతో వారిని ఆదుకునే ప్రయత్నం చేసింది. ఈ పథకం లక్ష్యం ఏది అయినా అది రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, సీఎం కెసీఆర్ కు తాజాగా ముగిసిన ముందస్తు ఎన్నికల్లో ఖచ్చితంగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఇక అంతే.  అందరూ అదే బాట పట్టడం ప్రారంభించారు. ఇప్పుడు కేంద్రం వంతు వచ్చింది. శుక్రవారం నాడు కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో రైతులపై వరాలు ప్రకటించారు.దేశంలో ఐదు ఎకరాల లోపు పొలం ఉన్న రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు అందించనున్నట్లు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. నేరుగా రైతు ఖాతాల్లోకి ఈ నిధులు వస్తాయని..రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేదని తెలిపారు.  ప్రతి ఏడాదీ ఈ పెట్టుబడి సాయం అందిస్తాంమని తెలిపారు. మూడు వాయిదాల ద్వారా ఈ డబ్బు రైతుల ఖాతాల్లో వేయనున్నారు. చిన్న, సన్నకారు రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా డబ్బు. దీని ద్వారా దేశంలోనని 12 కోట్ల రైతులకు మేలు జరుగుతుందని అంచనా. దీనికి ఏటా కేంద్ర సర్కారు 75 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.అంతే కాకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఎకరాకు 2500 రూపాయల సాయం అంటూ ముందుకొచ్చారు. గత ఎన్నికల్లో ఇచ్చిన రుణ  మాఫీనే ఆయన ఇంత వరకూ అమలు చేయలేదు కానీ..కొత్తగా రైతులకు కొత్త స్కీమ్ డిజైన్ చేశారు. అంతే కాదు..కౌలురైతులను ఆదుకుంటానని చెబుతున్నారు.  నాలుగైదేళ్ల పాలన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ తమ సీట్లను కాపాడుకునేందుకే ‘ఓట్ల వ్యవసాయం’ ప్రారంభించాయి. కారణం ఏదైనా కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవటం హర్షించదగ్గ పరిణామమే అని చెప్పొచ్చు.

Related Posts