యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
టీడీపీ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు రంగులు మారుస్తుంటారని ప్రతిపక్షాలు విరుచుకుపడుతూనే ఉంటాయి. కానీ నిజంగానే చంద్రబాబు రంగులు మార్చారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆ రంగులు మార్చడం గురించి కాదు.చంద్రబాబు పేరు చెప్పగానే ఆయన డ్రెస్సింగ్ స్టయిల్ మన కళ్లముందు కదులుతుంది. ముదురు గోధుమరంగు ప్యాంట్ పైన లేత గోధుమరంగు షర్ట్ వేసుకోవడం చంద్రబాబుకు అలవాటు. కొన్ని దశాబ్దాలుగా బాబును ఇలానే చూస్తున్నాం
అలాంటి చంద్రబాబు ఇప్పుడు అకస్మాత్తుగా నల్లరంగు షర్ట్ వేసుకున్నారు. తెలుపు రంగు ప్యాంట్ వేసుకున్నారు. ఇలా సరికొత్త వస్త్రధారణతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. బాబు ఇలా రావడం వెనక అతిపెద్ద రీజన్ ఉంది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మోసం చేసిందంటూ తీర్మానం చేస్తూనే - ప్రత్యక్షంగా కూడా నిరసన తెలపడం కోసం అంతా ఈ డ్రెస్ కోడ్ లోకి వచ్చేశారు.