యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఈరోజు సరికొత్త రికార్డు నెలకొల్పింది. న్యూజిలాండ్‌తో హామిల్టన్ వేదికగా జరిగిన మూడో వన్డేతో భారత్ తరఫున 200 వన్డేలాడిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. 1999, జనవరి 25న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మిథాలీ రాజ్.. 200 వన్డేలు ఆడి 51 సగటుతో 6,622 పరుగులు చేసింది. ఇందులో ఏడు శతకాలు ఉండగా.. 52 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ 200 వన్డేల్లో 180 సార్లు బ్యాటింగ్‌కి వెళ్లిన మిథాలీ రాజ్.. ఏకంగా 51సార్లు నాటౌట్‌గా నిలిచింది. మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌వుమెన్‌గా ఇప్పటికే రికార్డుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న మిథాలీ రాజ్.. తాజాగా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రీడాకారిణిగానూ ఘనత అందుకుంది. న్యూజిలాండ్‌తో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొన్న మిథాలీ రాజ్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటవగా.. భారత్ 44 ఓవర్లలో 149 పరుగులకి ఆలౌటైంది. ఆ తర్వాత లక్ష్యాన్ని న్యూజిలాండ్ 29.2 ఓవర్లలోనే 153/2తో ఛేదించింది.