యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎన్టీఆర్ నగర్ లబ్ధిదారులకు గృహాలు కేటాయింపులు జరిగాయి.
లాటరీ విధానంలో 686 గృహాలను లబ్ధిదారులకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కేటాయించారు. మంత్రి మాట్లాడుతూ పీఎంఏవై - ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద గృహాలు కేటాయింపులు జరిగాయి.
ఈ నెల 9 తేదీకి 4512 ఇళ్లను గృహ ప్రవేశాలకు సిద్ధం చేస్తున్నాం. గృహ సముదాయంలో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాంమని అన్నారు. అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానంతో ఇళ్ళను నిర్మించడం జరుగుతుంది. 9వ తేదీన ఒకే రోజు నాలుగు లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు వుంటాయని అన్నారు. ప్రతి పేదవాని సొంతింటి కలను నెరవేర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. మార్చి నాటికి పది లక్షల ఇళ్ళను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. పింఛన్ల పంపిణీకి సంవత్సరానికి రూ. 14 వేల కోట్లు ఖర్చు అవుతుంది. రైతులకు రూ. 20 వేల కోట్లు, బీసీలకు 3 వేల కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు.