యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
శుక్రవారం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌పై మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పందించారు. ఇది ఎన్నికల బడ్జెట్ అని ఆయన అన్నారు. ఈ బడ్జెట్‌లో రైతులు, మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించేలా ఆర్థిక మంత్రి ప్రకటించిన వరాలు.. ఎన్నికలపై ప్రభావం చూపుతాయని మన్మోహన్ స్పష్టం చేశారు. మేలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ రూపంలో అంది వచ్చిన అవకాశాన్ని మోదీ ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకుంది. ఈ బడ్జెట్‌లో మిడిల్ క్లాస్‌కు ఊరట కలిగించేలా రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు, ఐదెకరాల లోపు భూమి ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం, అసంఘటిత రంగంలోని కార్మికులకు నెలకు రూ.3 వేల పెన్షన్‌లాంటి జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఆర్థిక సాయం, మిడిల్ క్లాస్‌కు వరాలు కచ్చితంగా ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని మన్మోహన్ అభిప్రాయపడ్డారు