యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్‌లో రైతులకు ఆర్థిక సాయం పేరుతో ఏడాదికి రూ.6 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలుసు కదా. దీనిపై రాహుల్ స్పందిస్తూ.. మీ ఐదేళ్ల పాలనలో మీ అహంకారం, అసమర్థత కారణంగా రైతుల జీవితాలు పూర్తిగా నాశనమైపోయాయి. ఇప్పుడు వాళ్లు పడుతున్న శ్రమకి రోజుకు రూ.17 ఇవ్వాలనుకోవడం రైతులను ఘోరంగా అవమానించడమే అవుతుంది అని రాహుల్ ట్వీట్ చేశారు. కిందట చివరి బూటకపు బడ్జెట్ అంటూ ఓ హ్యాష్‌ట్యాగ్ కూడా రాహుల్ ఇవ్వడం విశేషం. కిసాన్ సమ్మాన్ నిధి పథకం పేరుతో రైతులకు నేరుగా ఆర్థిక సాయం చేయాలని ఈ బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఈ పథకం వర్తింపజేయాలని నిర్ణయించడంతో మొత్తం 12 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. ఈ పథకానికి రూ.75 వేల కోట్లు ఖర్చు కానుంది.