యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఒకప్పుడు రైతన్నా, వ్యవసాయమన్నా ముందుగా గుర్తోచ్చేది ఇంటి ముందు కొట్టంలో ఉండే జోడెడ్లు, ఎద్దుబండి, కర్రు, నాగలి, ఇప్పుడు పరిస్థితి మారింది. పరికరాలన్నీ కనుమరుగైపోతున్నాయి. పశువుల పేడతో తయారైన సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువును వ్యవసాయ భూముల్లో వాడేవారు. నాణ్యమైన పంట, అధిక దిగుబడి వచ్చేది. పశువులను పెంచుకోవాలంటే రైతులు జంకుతున్నారు. విధ గ్రామాల్లో సాగు చేసిన కంది, వరి పంటను కోసేందుకు కూలీలు దొరకని పరిస్థితి నెలకొంది. అయితే ఎండలు మండుతుండడంతో కూలీలు సైతం వరి, కంది పంటల కోతల సమయంలో కూలీలు పెద్దగా ఆసకిత్త చూపడం లేదు. దీంతో రైతులు కూలీల కోసం వెతుకులాట ప్రారంభిస్తున్నారు.కొందరైతే ఇతర గ్రామాల నుంచి తీసుకొచ్చుకుని కంది, వరి పంటలను కోస్తున్నారు. మండల వ్యాప్తంగా దాదాపు 950హెక్టర్లకుపైగా వరి, 10,000 వేల హెక్టర్లకుపైగా కంది సాగు చేశారని మండల వ్యవసాయ అధికారులు తెలిపారు.కంది,వరి పంటలను కోసేందుకు కూలీలు దొరకక పోవడంతో రైతులు కోతల సమయంలో ఖర్చుకు సైతం వెనుకాడకుండా కంది, వరి కోత మిషన్లను ఆశ్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి వాటిని తీసుకవచ్చి వరి, కంది పంటలను ఒకే రోజులో ధాన్యా న్ని తమ ఇళ్లకు చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో కంది పోట్టు, వరి గడ్డి ముక్కలై పశువులకు తినడానికి పనికి రాకుండా పోతుందని రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నరు.హర్వెస్టర్ సాయంతో గంటకు ఎకరం వరకు వరి, కంది పంటలను కోత నిర్వహించవచ్చు.కాని గంట సమయానికి వరి కోత మిషన్‌కు రైతుల నుంచి గంటలకు రూ.2000, కంది కోతకు రూ.1800 వందల వరకు తీసుకుంటున్నట్లు రైతులు తెలుపుతున్నారు. ప్రతి సంవత్సరం కొందరు రాజస్థాన్, పంజా బ్, హర్యాన నుంచి హర్వెస్టర్లను అద్దెకు తీసుకోచ్చి కోతలు నిర్వహిస్తున్నారు. మిషన్ల సాయంతో కోత లు నిర్వహించడంతో రైతుల నుం చి హర్వెస్టర్లకు గిరాకీ పెరిగిందిమండల పశువైద్యాధికారిణి డాక్టర్ అనూష తెలిపిన వివరాల ప్రకారం కమ్మర్‌పల్లి మండలంలో 6000 గోజాతి, 5000 గేదెజాతులు ఉన్నాయి. వాటికి కావల్సిన దాణా, పశువులను కాసే వాళ్లు దొరకక నిర్వహణ బారమవడంతో రైతులు ఆసక్తి కనబరచడంలేదు.పశువుల పేడ దొరక్కపోవడం విచ్చలవిడిగా రసాయనాలు చల్లడం వంటి పరిణామాలతో భూములు జీవం కోల్పోతున్నాయి. భూసారం తగ్గుతోంది. పెట్టుబడులు ఏటికేడు పెరిగిపోతున్నాయి. దానికి తోడు వ్యవసాయ అధికారులు ఎంత అవగాహన కల్పించిన భూసార పరీక్షలు, విత్తనశుద్ధి వంటి జాగ్రత్తలు పాటించకపోవడంతో పంట దిగుబడి తగ్గిపోతుంది.ఎడ్ల కోరత, సమయాభావంతో అధిక శాతం మంది రైతులు పోలాలు దున్నటానికి ట్రాక్టర్లు, నాటు వేయడానికి డ్రమ్‌సీడర్లు, కలుపు తీయడానికి వీడర్లు, పవర్ స్ప్రేమర్లు, కోతలను హార్వెస్టర్లు వంటి యంత్రాలు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం సబ్సీడీ రూపంలో యంత్రాలు అందించడంలో రైతులు అటువైపే మొగ్గు చూపుతున్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయ పనుల్లో కూలిలు కనిపించక పోయినా ఆశ్చర్య పోనవసరంలేదని రైతులు పేర్కోంటున్నారు.వ్యవసాయంలో రైతులు ఎక్కువగా యంత్రాల వైపే మొగ్గు చూపుతున్నారు. యాంత్రీకరణ ద్వారా సమయం ఆదా అవడంతో పాటు ఎక్కువ మంది కూలీల అవసరముండదు. కోన్నేళ్తుగా మేం హార్వెస్టర్‌తోనే వరి కోస్తున్నామంటున్నారు రైతులు