YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోట్ల ఎంట్రీ తో కేఈ అలక

కోట్ల ఎంట్రీ తో కేఈ అలక
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అమరావతిలో.. టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆలయ భూకర్షణ కార్యక్రమానికి దేవాదాయ మంత్రి కేఈ కృష్ణమూర్తి హాజరు కాలేదు. ఆ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే.. తాను అసంతృప్తికి గురయ్యానంటూ.. మీడియాను పిలిచి మరీ ఆఫ్ ది రికార్డ్‌గా చెప్పుకున్నారు. దేవాదాయ మంత్రి, ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి లాంటి కీలక పొజిషన్‌లో ఉన్న తనకు.. ఓ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌తో ఆహ్వానపత్రం పంపారన్నది.. కేఈ వ్యక్తం చేసిన అసంతృప్తి. కేఈ వ్యాఖ్యల గురించి తెలిసిన తర్వాత చంద్రబాబు.. టీటీడీ ఈవోను పిలిపించి మాట్లాడారు. ప్రోటోకాల్ ప్రకారమే అంతా చేశామని.. ఎక్కడా… కేఈ గౌరవానికి భంగం కలుగనీయలేదని.. టీటీడీ ఈవో సీఎంకు చెప్పారు. కేఈ అసంతృప్తికి కారణం.. ఆహ్వాన గౌరవం కాదని.. రాజకీయమేనన్న చర్చ.. అసెంబ్లీ లాబీల్లో నడుస్తోంది.కర్నూలు టీడీపీకి పిల్లర్‌గా ఉన్న తనకు చెప్పకుండానే.. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చంద్రబాబు పిలిపించి మాట్లాడటం కేఈకి నచ్చలేదంటున్నారు. తాను ఈ అంశంపై ముఖ్యమంత్రి తో మాట్లాడనని… ఆయన అడిగితేనే తన అభిప్రాయం చెబుతానని చెప్పుకొచ్చారు కూడా. కర్నూలు జిల్లాలో మూడు దశాబ్దాలుగా ఎవరితో పోరాడామో…అందరూ తెలుసుకోవాల్సి ఉందని నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. అంతే కాదు.. తాను వచ్చే క్యాబినేట్ సమావేశానికి ఉండనేమోనని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేయబోతున్నాడని… అందుకే వచ్చే ప్రభుత్వంలో తాను ఉండనని చెప్పానని కవర్ చేసుకున్నారు.ఇప్పటి పరిస్థితిని చూస్తే.. కోట్ల కుటుంబం.. తెలుగుదేశం పార్టీలోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. కేఈ స్పందనను.. బట్టి… ఆయన రాక విధివిధానాలు ఖరరావుతాయని భావిస్తున్నారు. కేఈ కృష్ణమూర్తి ఈ సారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నారు. పత్తికొండలో ఆయన కుమారుడు శ్యాంబాబు పోటీ చేస్తారు. ఈ మేరకు.. చంద్రబాబు టిక్కెట్ హామీ ఇచ్చేశారని ప్రచారం జరుగుతోంది. కానీ.. డోన్‌ కూడా.. ఎప్పుడూ ఆ కుటుంబ సభ్యులే పోటీ చేస్తూ ఉంటారు. ఆ టిక్కెట్ కూడా.. కేఈ కుటుంబానికే చంద్రబాబు ఇస్తే… కేఈ .. కోట్లతో సర్దుకుపోయే అవకాశం ఉందని… ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఆ దిశగా.. ఒత్తిడి పెంచడానికే.. అలకని అంటున్నారు. ఏమైనా.. కర్నూలు టీడీపీ రాజకీయం.. ఇప్పుడు రసకందాయంలో ఉందని చెప్పుకోవచ్చు.

Related Posts