YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎట్టకేలకు జనసేన కమిటీలు

 ఎట్టకేలకు జనసేన కమిటీలు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎవ‌రెన్ని చెప్పినా ప‌వ‌న్ అదృష్ట‌వంతుడే. సినిమాల్లో చేసిన‌వి త‌క్కువ‌. పొందిన అభిమానం ఎక్కువ‌. రాజకీయాల్లో ఆయ‌న ఇంట్లోనే అతిపెద్ద ఫెయిల్యూర్ ఉంది. కానీ అదే ఇంటి నుంచి వ‌చ్చి మ‌ళ్లీ జ‌నం లో చిరంజీవి స్థాయి ఆక‌ర్ష‌ణ తేగ‌లిగారు. పార్టీ నిర్మించ‌కుండానే త‌నదైన ముద్ర వేశారు. అంద‌రికీ ఇలా క‌లిసి రావాలి క‌దా. మ‌రో రెండు మూడు వారాల్లో ఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలో క‌మిటీలు, నాయ‌క‌త్వాలు లేని పార్టీ అంటూ వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతూ ప‌వ‌న్ ఎట్ట‌కేల‌కు ఓ బ‌ల‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. కొత్త‌గా క‌మిటీల‌ను ప్ర‌క‌టించారు.ప‌వ‌న్ అంటే మాట‌లా త‌న‌కంటూ ఓ స్పెషాలిటీ ఉండాలి క‌దా. అందుకే క‌మిటీల‌కు అధ్య‌క్షులు ఎవ‌ర‌న్న విషయం కూడా చెప్ప‌కుండానే ఆయా క‌మిటీలో మ‌హిళ‌లకు కీల‌క పాత్ర ఇస్తూ నియ‌మించారు. కొన్ని విభాగాల‌కు అధ్య‌క్షుల‌ను ప్ర‌క‌టించ‌క‌ముందే మెంబ‌ర్ల‌ను నియ‌మించ‌డం ద్వారా ఒక కొత్త సంప్ర‌దాయానికి ప‌వ‌న్ తెర‌తీశారు.ఇక ఈ క‌మిటీల్లో క‌నిపించిన పేర్ల‌ను చూస్తే అన్ని రంగాల వారు ఉండేలా జాగ్ర‌త్త‌గా ఎంపిక చేసిన‌ట్లే క‌నిపిస్తోంది. వాళ్లెవ‌రో కొంద‌రిని గ‌మ‌నిద్దాం. పార్టీ మ‌హిళా విభాగం- వీర మ‌హిళ. ఆ క‌మిటీకి అధ్య‌క్షురాలు ఆడిటర్ అయిన‌ క‌ర్నూలు జిల్లాకు చెందిన జ‌వ్వాజి రేఖ. ఈ క‌మిటీలో వైస్ చైర్మన్లు సింధూరి కవిత  షేక్ జరీనా, నూతాటి ప్రియా సౌజన్య, శ్రీవాణి  నియమితులయ్యారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవ‌డం ఈ క‌మిటీ ప‌ని అట‌.ఇక ఇత‌ర క‌మిటీలు చూస్తే… పార్టీ పొలిటికల్ అపైర్స్ కమిటీలో సుజాత పాండా,  పాలసీ వింగ్ చైర్మన్‌గా డాక్ట‌ర్ యామినీ జ్యోత్స్న‌ కంబాల నియ‌మితుల‌య్యారు. పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీల్లో పార్లమెంటరీ వర్కింగ్ కమిటీ స‌భ్యులుగా షాహిన్ సయ్యద్, షేక్ రజియా, మంజుల సునీత, సావిత్రి, వాశిలి తుషార బిందులను ప‌వ‌న్‌ నియ‌మించారు.క్యాంపెయినిగ్ అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్‌గా బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి ఉషశ్రీ పినిషెట్టిని నియమించారు. జై కిసాన్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా లక్ష్మి కుమారి, పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా పద్మావతి నియమితుల‌య్యారు. సెంట్రల్ ఆఫీస్ గ్రీవెన్స్ కమిటీలో శ్యామల, రత్నమాల రెడ్డి, విజయలక్ష్మి, పద్మ, ధనలక్ష్మిలకు చోటు ద‌క్కింది. మొత్తానికి కొత్త క‌మిటీ పేర్ల‌ను ప్ర‌క‌టిస్తూ ముందుగా మ‌హిళ‌ల‌ను ఎంపిక చేయ‌డం ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామ‌మే

Related Posts