YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రకాశం వైసీపీలో అసమ్మతి

ప్రకాశం వైసీపీలో అసమ్మతి
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీలో ఎన్నికల వేడి స్టార్ట్‌ అవ్వడంతో ప్రకాశం జిల్లా వైసీపీలో అసమ్మతి చాప కింద నీరులా విస్తరిస్తోంది. పదేళ్ల పాటు పార్టీ జెండాను మోసిన వాళ్లని నిర్థాక్షిణ్యంగా పక్కన పెడుతున్న జగన్‌ కొత్త వాళ్లను తెర మీదకు తీసుకురావడంతో పార్టీ జెండా మోసిన కార్యకర్తలు, నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ప్రత్యేకించి పార్టీ అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరికి నచ్చడం లేదు. ఇప్పటికే జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో తీవ్రమైన అసంతృప్తి ఉండగా తాజాగా పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్‌ చెంచురాంను సైతం జగన్‌ పార్టీలోకి తీసుకుని దాదాపు ఆయనకే టిక్కెట్‌ ఖరారు చేస్తుండడంతో నియోజకవర్గంలో పాత కేడర్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో పాత సమన్వయకర్తలను తొలగించి వారి స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్‌ ఇచ్చారు.దీంతో మిగిలిన నియోజకవర్గాల్లో ఉన్న సమన్వయకర్తలకు సైతం తనకు ఎన్నికల వేళ‌ సీటు వస్తుందా ? లేదా అన్న సందేహం నెలకొంది. జిల్లాల్లో గత ఏడెనిమిది నెలల్లో ఐదు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను తప్పించి కొత్త వారిని తెర మీదకు తీసుకువచ్చారు. దర్శిలో అయితే బాదం మాధవరెడ్డిని నియమించాక‌ తిరిగి ఐదారు నెలల్లోనే మార్చి కొత్తగా మద్దిశెట్టి వేణుగోపాల్‌ను తెర మీదకు తెచ్చిన సంగతి తెలిసిందే. కొత్త సమన్వయకర్తలు వచ్చిన నియోజకవర్గాల్లో ఒక కందుకూరులో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ద్వితీయ శ్రేణి కేడర్‌లో అయోమయం నెలకొది. కొండపిలో మాజీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు అనుచరుల ఆందోళనలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కొత్త ఇన్‌చార్జ్‌ మాదాసు వెంకయ్యకు అశోక్‌బాబు అనుచరులు సహకరించే పరిస్థితి లేదు.గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబే నాయకుడని పార్టీ నాయకత్వం ప్రకటించినా సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీ సమన్వయకర్త ఐవీ. రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనా రెడ్డి శాంతించడం లేదు. ఎన్నికల నాటికి అయినా తమకు సీటు రాకపోతుందా అని వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి ఓ వర్గంగానూ మాజీ సమన్వయకర్త బాదం మాధవరెడ్డి మరో వర్గంగానూ కొత్తగా సమన్వయకర్తగా వచ్చిన మద్దిశెట్టి వేణుగోపాల్‌ కేడర్‌ మరో వర్గంగానూ ఉంటున్నారు. ఈ ముగ్గురులో ఎవరికి ఎవరూ సహకరించుకునే పరిస్థితి కనపడడం లేదు. ఇక సీనియర్‌ నాయకుడు, ఎన్టీఆర్‌ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరడంతో పర్చూరు వైసీపీలో మూడు ముక్కలాట మొదలైంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన గొట్టిపాటి భరత్‌ ఓ వర్గంగానూ, ప్రస్తుత సమన్వయకర్తగా ఉన్న రావి రామనాథం మరో వర్గంగానూ ఇప్పుడు దగ్గుబాటి వాళ్ల ఎంట్రీతో మూడో వర్గంగానూ వైసీపీ నిలువునా చీలింది. పాత నాయకులంతా దగ్గుబాటికి సహకరించే పరిస్థితి లేదని తెగేసి చెబుతున్నారు.పర్చూరు నియోజకవర్గంలో జగన్‌ సామాజికవర్గానికి చెందిన నేతలు సైతం దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సహకరించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే అద్దంకిలో ప్రస్తుతం సమన్వయకర్తగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్యకు సీటు వస్తుందా ? లేదా అన్నది కూడా సందేహమే. అక్కడ నుంచి వైసీపీకి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చినవెంకటరెడ్డి సైతం తాను కూడా టిక్కెట్‌ రేసులో ఉన్నానని ప్రకటనలు చేస్తుండడంతో పార్టీ కేడర్‌లో తీవ్రమైన గందరగోళం నెలకొంది. ఇక జిల్లా కేంద్రమైన ఒంగోలులో బాలినేని సమర్థవంతమైన నేతగా ఉన్నా నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు, సమీకరణల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపు కూడా అంత సులువు కాదన్న వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ప్రకాశం జిల్లా వైసీపీలో ఆరేడు నియోజకవర్గాల్లో ఉన్న అసంతృప్తి వైసీపీకి పెద్ద మైన‌స్‌గా మారింది. ఎన్నికల వేళ‌ జగన్‌ ఈ అస‌మ్మ‌తికి చెక్‌ పెట్టకపోతే వైసీపీ నిండా మునగడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Posts