YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రతినెల లక్ష గృహాలు

 ప్రతినెల లక్ష గృహాలు
నగర కార్పొరేషన్ పరిధిలో గృహప్రవేశానికి సిద్ధమవుతున్న పేదల ఇళ్ల ను మంత్రి నారాయణ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ 
ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా లక్ష గృహాలకు సామూహిక గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని పట్టణ పేదల కోసం ముఖ్యమంత్రి 30 లక్షల గృహాలను మంజూరు చేశారు. ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి చేతులమీదుగా లక్ష గృహ ప్రవేశాలు నిర్వహిస్తున్నాం. ప్రతినెల లక్ష గృహాలను పేదలకు అందిస్తామని అన్నారు. పట్టణ పేదలకు గేటెడ్ కమ్యూనిటీ ని తలదన్నే విధంగా మౌలిక వసతులు కల్పించాం. పేదలకోసం ఇంతటి నాణ్యత ప్రమాణాలు కలిగిన గృహాల నిర్మాణం దేశంలోనే ఒక చరిత్ర. కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ బీజేపీ మేనిఫెస్టో, ఆర్ఎస్ఎస్ అజెండా లాగా ఉందని అన్నారు. 
మన బిజెపి నాయకులు రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలి రాజకీయ స్వార్థంతో మాట్లాడుతున్నారు. కేంద్ర బడ్జెట్లో విభజనహామీలపై ప్రస్తావన ఎందుకు చేయలేదో నిలదీయాలి. ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని చెప్పిన ప్రధాని, రాజధానికి ఎందుకు నిధులు కేటాయించలేదో ప్రశ్నించాలని అన్నారు. రాజ్యాంగబద్ధంగా 14వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన నిధులను కూడా బిజెపి నాయకులు తమ తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు. వైసిపి బిజెపిల లాలూచీ గురించి కొత్తగా మాట్లాడటానికి ఏమీ లేదు. వైసీపీ-బీజేపీ అను ప్రజలు వేరు వేరుగా చూడటం లేదు. ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్న సైంధవులు గా చూస్తున్నారని అయన అన్నారు. 

Related Posts