యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. అక్కడ ఆయన థాకూర్‌నగర్‌లో ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లును ఆయన ప్రశంసించారు. ఆ బిల్లుకు రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపాలని మోదీ కోరారు. పౌరసత్వ సవరణ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. అయితే బిల్లుకు మద్దతు ఇచ్చి పార్లమెంట్‌లో పాస్ అయ్యేలా చూడాలని మోదీ తృణమూల్ పార్టీని కోరారు.శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పైన కూడా మోదీ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత యువత, రైతులు, ఇతర వర్గాలకు మరిన్ని వరాలు ఉంటాయన్నారు. మమతా బెనర్జీ పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారని మోదీ అన్నారు.