యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియాను ఎదుర్కోవడం కష్టమేనని అన్నారు ఐసీసీ సీఈవో రిచర్డ్‌సన్. ప్రస్తుతం భారత అన్ని విభాగాల్లో దుర్భేద్యంగా కనిపిస్తోందన్నారు. ప్రపంచకప్ ఆవిష్కరణ నిమిత్తం భారత్ వచ్చిన ఆయన టీమిండియా ఆటతీరుపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుత క్రికెట్‌లో భారత్‌తో పాలు ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా పటిష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ప్రపంచకప్ విజేత ఎవరో ఊహించడం కష్టమైనప్పటికీ.. టీమిండియా మాత్రం హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగుతుందని రిచర్డ్‌సన్ అన్నారు. భారత్-పాక్ మధ్య లీగ్ దశలో లేకపోయినా సెమీస్ లేదా ఫైనల్లో కచ్చితంగా తలపడతాయని జోస్యం చెప్పారు. స్వదేశంతో పాటు విదేశాల్లోనూ భారత్ అద్భుతంగా రాణిస్తోందని కితాబిచ్చారు. ఈ ప్రపంచకప్ హోరాహోరీగా జరగడం ఖాయమని అభిప్రాయపడ్డారు. మే 30న ప్రారంభం కానున్న ఐసీసీ ప్రపంచకప్ జులై 14న లార్డ్స్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.