యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో చిరుత బీభత్సం సృష్టించింది. జనాలపై పంజా విసురుతూ భయబ్రాంతులకు గురిచేసింది. హిమాచల్ ప్రదేశ్ అటవీ ప్రాంతం నుంచి పంజాబ్‌లోకి ప్రవేశించిన చిరుత జలంధర్‌లో సమీపంలోని లంబా పిండ్ గ్రామంలోకి చొరబడింది. చిరుతను పట్టుకోడానికి ఇద్దరు వ్యక్తులు వలను వేసినా అది చిక్కుకోలేదు. వారిపై దాడి చేస్తూ వీధుల్లో పరుగులు పెట్టింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. చివరకు అటవీ అధికారులు ట్రాంక్విలైజర్ గన్‌తో చిరుతను షూట్ చేశారు. దీంతో మత్తులో జారుకున్న చిరుతను బోనులో బంధించి.. చాట్‌బిర్ జూకు తరలించారు. ఈ జనవరి 31న చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి.