యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన పింఛన్ల పంపిణి కార్యక్రమంలో మంత్రి శిద్దా రాఘవరావు ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పటానికి పాలాభిషేకంతో పసుపు-కుంకుమ, పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది. పసుపు-కుంకుమ 2 పథకం క్రింద రూ. 14,90,70,000 ల చెక్కును మహిళా సంఘాలకు మంత్రి అంద చేసారు. మంత్రి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పెన్షన్ల పంపిణీ. రాష్ట్రంలో పండుగ వాతావరణం. డ్వాక్రా మహిళా పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రిక అని అన్నారు. రాష్ట్రంలో 94 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ. 10 వేలు చొప్పున ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో ఉంది. రాష్ట్రంలోని ప్రతి మహిళకు అన్నగా ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా ఉంటారు. మగవాళ్లకు పోటీగా డ్వాక్రా సంఘాల మహిళలు వ్యాపారాలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ కేసులు పెట్టినా ఐటీ, సీబీఐ దాడులకు భయపడకుండా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ప్రగతిపథంలోనికి తీసుకు వెళ్తున్నారని అన్నారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాన్ని ప్రగతిలో మొదటి స్థానంలో నిలిపామని మంత్రి అన్నారు.