YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పార్లమెంట్ లో బి.సి బిల్లు పెట్టాలని జంతర్ మంతర్ వద్ద భారీ ప్రదర్శన

 పార్లమెంట్ లో బి.సి బిల్లు పెట్టాలని జంతర్ మంతర్ వద్ద భారీ ప్రదర్శన

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పార్లమెంట్ లో బి.సి బిల్లు పెట్టి చట్టసభలలో బి.సిలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని, బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ  లకు రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్వర్యంలో డిల్లీలోని పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన జరిపారు. “ఓట్లు బి.సి లవి – సీట్లు అగ్రకులాలకా ! – రాజ్యాధికారంలో వాటా కావాలంటూ నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,రాజస్తాన్, డిల్లీ కి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 
ధర్నానుద్దేశించి ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అగ్రకులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి ఆఘ-మేఘాల మీద 10 శాతం రిజర్వేషన్లు పెట్టారు. కాని బి.సి లకు చట్ట సభలలో రిజర్వేషన్లు పెట్టాలని 30 సం.రాలుగా పోరాడుతున్నా ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఈ దేశంలో బి.సి లను బిచ్చగాళ్ళను చేశారని విమర్శించారు. బి.సిలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండ గొర్రెలు,  బర్రెలు,  పందులు,  పెన్షన్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని బి.సిలను శాశ్వత బిచ్చగాళ్ళను చేస్తున్నారని విమర్శించారు.
 రాజ్యాంగ రచన సమయంలోనే బి.సిలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాలలో రిజర్వేషన్లు పెడితే ఎంతో ప్రగతి జరిగేది. కులతత్వం కనీస స్థాయికి వచ్చేది. బి.సిలకు ఏయే రంగాలాలో అన్యాయం జరిగిందో చూద్దాం.
రాజకీయ రంగంలో  బి.సి ల ప్రతినిత్యం 14 శాతం దాటలేదని కేంద్ర ప్రభుత్వం ఇటివల సేకరించిన గణాంకాల ద్వార తెలిoది. కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్ర మంత్రి వర్గంలో, లోక్ సభ, రాజ్య సభ, రాష్ట్ర అసెంబ్లీ లు, కౌన్సిల్సు లో 71 సంవత్సరాల బి.సి ల ప్రాతినిద్యం సర్వే చేసి లేకించగా, 14 శాతం దాటలేదంటే బి.సి లకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత అన్యాయం జరిగిందో తెలుస్తుంది. బి.సి లకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందని గణాంకాలు తెలుపుతునాయి 29 రాష్ట్రాలలో 16 రాష్ట్రాల నుండి ఒక్క బి.సి. పార్లమెంట్ సబ్యులు లేరు.అలాగే 545 లోక్ సభ సబ్యులలో బి.సి లు కేవలం 96 మంది మాత్రమే. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇ ఎక్కడ కనిపిస్తుంది. తెలంగాణ లో 119 ఎమ్మెల్యేలు  ఉంటే  బి.సి లు కేవలం 22 మంది మాత్రమే ఉన్నారు. ఆంధ్రలో  175 మందిలో బి సి లు 33 మంది మాత్రమే ఉన్నారు. తెలంగాణ రాష్టంలో 31 జిల్లాలు ఉండగా 20 జిల్లాల నుంచి ఒక్క బి.సి శాసనసభ్యులు లేరు. రాష్ట్రంలో 112 బి సి కులాలు ఉండగా 104కులాలు ఇంతవరకు అసెంబ్లీ గడప తొక్కలేదు. ఇంత తక్కువ ప్రాతినిథ్యం చూస్తే ఇదెలా ప్రజస్వామ్యమవుతుంది. 52 శాతం జనాభా గల బి.సి లకు ప్రాతినిథ్యం ఏది? బి.సిలు ఓట్లు వేయడానికేనా.  ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. డబ్బుల ప్రభావం ఎన్నికల మీద విపరీతంగా వుంది. ఇలాంటి పరిస్తితులలో డబ్బులు లేని బి.సి లు ఎన్నికలలో గెలవలేరు.
ఇటివల కేంద్ర ప్రభుత్వం జరిపిన ఉద్యోగుల సర్వేలో ఓబీసీలు 9 శాతం, అగ్రకులాలు 68 శాతం ఉద్యోగులు ఉన్నట్లు తెలిoది. 15 శాతం జనాభా ఉన్న అగ్రకులాలకు 68 శాతం ఉద్యోగులున్నా రిజర్వేషన్లు పెడుతున్నారు. అలాగే పాలన రంగం,  ఉద్యోగాలలో బి సి ల ప్రాతినిథ్యం జనాభాకు తగ్గట్టు అసలు లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బి.సిల ప్రాతినిథ్యం 9 శాతం దాటలేదంటే ఎంత అన్యాయం జరుగుతుందో గణాంకాలు తెలుపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో 54 లక్షల మంది ఉద్యోగులు ఉండగా ఇందులో బి.సి లు కేవలం 4 లక్షల 62 వేల మంది బి.సి  ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో బి.సి  తక్కువ ప్రాతినిథ్యం చూస్తే ఈ కులాలకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో సమాజం ఆలోచించవలిసిన సమయం ఆసన్నమైంది. ఇంత తక్కువ ప్రాతినిథ్యం చూస్తే బి.సి లకు జరిగిన చారిత్రక అన్యాయం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ప్రాతినిథ్యం పెంచాడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక ఉన్నత స్థాయి అధికార పదవులలో మొత్తం 29 గవర్నర్ పదవులు, 21 వాణిజ్య బ్యాంక్ చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్ల పదవులన్నీ 100 శాతం అగ్ర కులాలకు దార దత్తం చేయబడినవి. ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్రపతి కార్యాలయం, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు 98 శాతం అగ్రకులాలకే రిజర్వు కాబడి ఉన్నవి. ఇతర ఉన్నత స్థాయి అధికార పోస్టులలో 80 శాతం పోస్టులలో అగ్రకులా వారే ఉన్నారు. కాని బి.సి లకు కనీస స్థాయిలో ప్రాతినిథ్యం లేదు.ఇక 21 వాణిజ్య బ్యాంకులు, 245 ప్రభుత్వ రంగ సంస్థలలో చైర్మన్లు, ఎక్జుక్యుటివ్ డైరెక్టర్ల పోస్టులలో బి.సిలకు ఒక శాతం కుడా ప్రాతినిథ్యం లేదు.
 ఇక న్యాయ వ్యవస్థలో ముఖ్యంగా సుప్రీంకోర్టు – హైకోర్టు జడ్జీలలో మెజారిటి అగ్రకులాలవారే  ఉన్నారు. సుప్రీంకోర్టు లో 33 మంది ఉండగా మొత్తం అందరు అగ్ర కులాల వారే ! దేశంలోని మొత్తం 749 హైకోర్టు జడ్జీల పదవులలో 39 బి.సిలు, 18 ఎస్.సి, 5 ఎస్.టి లు పోగా మిగిలిన 687 జడ్జీలు ఉన్నత కులాల వారే ఉన్నారు. 
ఇక ప్రభుత్వం వ్యవస్థలో భాగమైన మంత్రి వర్గ వ్యవస్థలో ఇంతవరకు కేంద్ర క్యాబినెట్లలో 70 శాతం మంత్రి పదవులు అగ్రకులాలవారే అయ్యారు. అలాగే ముఖ్యమంత్రి పదవులు అన్ని అగ్రకులాలకే రిజర్వు చేసారు.
ఈ ధర్నా లో జాతీయ బి.సి సంక్షేమ సంఘం ఉపాద్యక్షులు గుజ్జ కృష్ణ, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్, బి.సి ఐకాస  చైర్మన్ నీరడి భుపేష్ సాగర్, ఎన్సీపీ  రాష్ట్ర అధ్యక్షులు సామల రవీందర్, మద్విరాజ్, మహేందర్ కేసరి, శేషగిరిరావు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts