YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వ్యవసాయం, సేవా రంగంలో ముందున్నాం

వ్యవసాయం, సేవా రంగంలో ముందున్నాం
ప్రతీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. మొదటి సారి పింఛన్ ను 5 రెట్లు పెంచాను.  ఈ రోజున మళ్లీ దాన్ని డబుల్ చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం కృష్ణా జిల్లా కేసరపల్లి లో  పింఛన్ల పండుగ కార్యక్రమంలో  అయన పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ  నాలుగున్నర సంవత్సరాల్లో పది రెట్లు పెంచి పేదవారికి, వృద్ధులకు, వితంతువులకు ఒక భరోసా కల్పించాను.  పింఛన్ ను రూ.2 వేలు చేసిన తర్వాత పెద్దవారు నన్ను దీవిస్తున్నారు. ఇంతకు ముందు పింఛన్ ను రూ.200 లు ఇస్తున్నప్పుడు ఇంట్లోని పిల్లలు వారి తల్లిదండ్రులను ఒక రకంగా చూసుకునేవారు.  రూ.1000 పింఛన్ ఇచ్చేప్పుడు పిల్లలు వారి తల్లిదండ్రులను కొంచెం చూస్తున్నారని అన్నారు.  రూ.2 వేలు చేసినప్పటి నుంచి  పెద్దవారిని మరింత బాగా చూసుకునే పరిస్థితికి తీసుకొచ్చాను.  ఈ పింఛన్ల వల్ల ఎవరి ఆరోగ్య ఖర్చును వారే పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది.  అనంతపురంలోని ఓ మహిళ తన పింఛన్ ను దాచి పెట్టుకుని అమరావతి అభివృద్ధికి రూ.50 వేలు ఇచ్చింది.  డ్వాక్రా సంఘాలను పెట్టి పేదవారందరిని మెంబర్లుగా చేశాం.  ఆస్తిలో మహిళలకు సమాన హక్కును కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్.  నేను 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మహిళల్లో స్ఫూర్తిని కల్పించే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశాను.  అన్ని రంగాల్లో మహిళలు ముందుకొస్తున్నారు .  10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో డ్వాక్రా సంఘాలు బాగా దెబ్బతిన్నాయి.  వెలుగు ప్రాజెక్టు పెడితే దాన్ని కూడా నిర్వీర్యం చేశారు.  కాంగ్రెస్ హయాంలో మైక్రో ఫైనాన్స్ కంపెనీలు పెట్టి 40 నుంచి 50 శాతం వడ్డీని వసూళ్లు చేయడం మొదలు పెట్టారని విమర్శించారు.  డబ్బులు కట్టని మహిళల నుంచి బలవంతంగా వసూలు చేశారు.  డ్వాక్రా సంఘాలు నా మానస పుత్రికలు.  తెలుగు జాతి కోసం హైదరాబాద్ ను అభివృద్ధి చేశాం.  అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతరం పనిచేస్తాను.  ఇక్కడ అభివృద్ధి జరగడం వల్ల భూముల రేట్లు పెరిగాయి.  మంత్రి లోకేశ్ చొరవతో హెచ్సీఎల్ ఇక్కడకు వచ్చింది.  రాష్ట్రాభివృద్ధి కోసం ఒక ప్రజాసేవకుడిలా ఆలోచిస్తున్నా.  డ్వాక్రా మహిళలకు 3 విడతల్లో రూ.10 వేలు పంపిణీ చేస్తాం. సాక్షి పేపర్ ఒక అసాక్షి పేపర్ ఎప్పుడు అపశకునాలే పలుకుతుంది.  మేం ఉచితంగా ఇస్తున్న సొమ్మును రుణం అంటూ కొందరు దుష్ర్పచారం చేస్తున్నారు. 3 చెక్కులను ముందస్తు తేదీలతో ఒకేసారి ఇస్తున్నాం. 58 లక్షల మంది లబ్ధిదారులకు పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నాం . దీంట్లో మధ్య వర్తులు ఎవరూ జోక్యం కల్పించుకోకండి.  94 లక్షల మందికి పసుపు-కుంకుమ కింద ఆర్థికసాయం చేస్తున్నాం.  రెట్టింపు చేసిన పింఛన్ 54 లక్షల మందికి ఇస్తున్నాం.  భర్తలేని ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్నాం.  ట్రాన్స్జెండర్స్ని ఎవరూ ఆదరించకపోతే వారికి పించన్ ఇచ్చి ఆదరించాం.  పాత పెన్షన్లు  రూ. 6,720 కోట్లు ఉంటే ఇప్పుడు రూ. 13,440 కోట్ల పింఛన్లు పెంచి ఇస్తున్నామంటే అదే టీడీపీ పార్టీ పట్టుదలని అన్నారు.  చంద్రన్న పెళ్లి కానుక 26769 మందికి రూ. 114 కోట్లు ఇచ్చాం.  సంక్షేమ కార్యక్రమాలు అధికంగా ఇస్తుంది మన ప్రభుత్వమే. చంద్రన్న భీమా కింద రూ. 5 లక్షలు ఇచ్చి ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటున్నాం.  ఎస్సీ, ఎస్టీలకు వంద యూనిట్లు కరెంట్లు ఉచితంగా ఇస్తున్నాం.  జయహో బీసీలో బీసీలకు ప్యాకేజీ ఇచ్చి అందరికీ 21 కార్పోరేషన్లు పెట్టానని అన్నారు.  అన్నా క్యాంటీన్ ద్వారా నాణ్యమైన భోజనం రూ. 5 లకు పెడుతున్నాం.  ఆరోగ్య ఖర్చులు గణనీయంగా తగ్గించాం.  విద్యపై ప్రత్యేక దృష్టి సారించాం.  ప్రతి కుటుంబం ఆనందంతో జీవించాలనే ఉద్దేశంతోనే ప్రతి సంక్షేమ కార్యక్రమం తీసుకువచ్చానని అన్నారు.  వ్యవసాయం, సేవా రంగంలో మొదటి స్థానంలో ఉన్నామని చంద్రబాబు అన్నారు. 

Related Posts