భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరి వన్డే వెల్లింగ్టన్ వేదికగా జరుగుతుంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ అమోఘంగా రాణించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించి న్యూజిలాండ్‌కు సవాలు విసిరింది దీంతో భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. బౌల్ట్ 3 వికెట్లు, నీషమ్ ఒక వికెట్ పడగొట్టారు.