షర్మిలపై సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితుడు వెంకటేశ్వరరావుని చంచల్ గూడ జైలుకు పోలీసులు ఈరోజు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని జైలుకు తరలించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. కాగా, ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేముల గ్రామానికి చెందిన వ్యక్తి (నిందితుడు) వెంకటేశ్వరరావు. గుంటూరులోని ఆర్వీఆర్ కళాశాలలో ఎంసీఏ చదువుతున్నాడు.