YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

ఢిల్లీ సీఎస్‌పై ఆప్‌ ఎమ్మెల్యేల దాడి

Highlights

  • ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఫిర్యాదు 
  •  మరో వివాదంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ
ఢిల్లీ సీఎస్‌పై ఆప్‌ ఎమ్మెల్యేల దాడి

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై దాడికి పాల్పడిన ఆప్‌ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఐఏఎస్‌ అధికారులు కోరారు. ఈ మేరకు మంగళవారం వారు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
'నిధుల ఖర్చుల విషయంలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తుంది. దానిని సీఎస్‌ ప్రశ్నించినందుకే ఎమ్మెల్యేలు దాడికి పాల్పడ్డారు' అని వారు వివరించారు. ఆప్‌ ఎమ్మెల్యేలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని.. రాష్ట్రంలో అధికారులకు రక్షణే లేకుండా పోయిందంటూ వారు  లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.

ఆమ్‌ ఆద్మీ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. ఇద్దరు ఆప్‌ ఎమ్మెల్యేలు సిఎం కేజ్రీవాల్‌ సమక్షంలోనే తనపై చేయి చేసుకున్నారంటూ ఢిల్లీ చీఫ్‌ సెక్రెటరీ అన్షు ప్రకాశ్‌ ఆరోపించారు. సోమవారం రాత్రి కేజ్రీవాల్‌ నివాసంలో సమీక్షా సమావేశం జరుగుతుండగా ఇద్దరు ఎమ్మెల్యేలు చేయిచేసుకున్నట్లు అన్షు ప్రకాశ్‌ ఆరోపించారు

Related Posts