
యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:
ఈ సంవత్సరం
పుష్యబహుళ అమావాస్య సోమవారం ది.04-02-2019 సోమవారం శ్రవణానక్షత్రయుక్త మహోదయపుణ్యకాలం.
మాఘ పుష్య మాసాలలో అమావాస్య
సోమవారం నాడు శ్రవణా నక్షత్రం కలిసిన పుణ్యకాలం
మహోదయం చెప్పబడుతోంది.
సముద్రపర్యంతంభూమిని దానం చేసిన పుణ్యఫలాన్ని పొందాలంటే రేపటిరోజున కంచుపాత్రలో పరమాన్నంఉంచి దానిపై సువర్ణ శివలింగాలన్ని ఉంచి దానిని దానం చేయుట వలన ఆ..పుణ్యఫలాన్ని పొందుతారని శాస్త్రవచనం.
కోటి సూర్య గ్రహణాలలో దానం, తపస్సు చేసిన పుణ్య
ఫలితము.. ఒక్క మహోదయ కాలంలో
చేసిన స్నాన, దాన, అనుష్ఠానాదులతో సమానము.
పరమాచార్య స్వామివారు మహోదయ పుణ్యకాలంలో విద్యారణ్యమునందు స్నానమాచరించినారట.
సులభంగా తరించటానికి ఇటువంటి సదవకాశాన్ని అందరూ ఉపయోగించు కోవాలని పెద్దలైన పండితులు బోధించారు.