YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీబీఐ చర్య దుర్మార్గం

 సీబీఐ చర్య దుర్మార్గం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

పశ్చిమ బెంగాల్లో సీబీఐ చర్య దుర్మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  సోమవారం పార్టీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాలను తమ నియంత్రణలో ఉంచుకోవాలనే కేంద్ర దుశ్చర్యను ఖండిస్తున్నామన్నారు. సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధమని, అంతా ఐక్యంగా పోరాడతామని స్పష్టం చేశారు.  అమిత్ షా పలాస పర్యటన రాజకీయ స్వార్థమే అని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని నేతలకు ఆదేశించారు. బీజేపీయేతర పక్షాలు ఇవాళ ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించామని, ఈ విషయం తెలిసే జగన్ హడావుడిగా ఢిల్లీ వెళ్లారని విమర్శించారు.  మోదీ కనుసన్నల్లో ఈసీని కలిసి ఫిర్యాదు అని జగన్ నాటకమాడుతున్నారని మండిపడ్డారు. 
తిరుపతిలో గోవిందరాజుల స్వామి ఆలయంలో చోరీ ఉపేక్షించేది లేదని చెప్పారు.  నిన్న హైకోర్టు నిర్మాణంతో నవ్యాంధ్రలో నవశకం చాటామన్నారు.  లక్ష్యాలకు అనుగుణంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Related Posts