యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
బిజెపి పాలనలో వ్యవసాయ వద్దు ఉద్యోగం ముద్దు అన్నట్లు తయారయిందని కాంగ్రెస్ పార్టీ ఎపి పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. సోమవారం అయన వేంపల్లెలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రైతులు బాగు పడాలన్నా, పంటలకు గిట్టుబాటు ధర లభించాలన్నా, బుణ విముక్తులు కావాలన్నా అటు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. మోడీ రైతుల రుణమాఫీ పథకాన్ని లాలిపాప్ తో పోల్చడం దురదృష్టకరమన్నారు. బిజెపి రైతు వ్యతిరేక పార్టీ అనేందుకు ఇది మచ్చుతునక అన్నారు. రైతులు ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఆదరించవలసిదిగా తులసిరెడ్డి కోరారు. ఈ మీడియా సమావేశంలో ఎఐసిసి సభ్యుడు ధ్రువ కుమార్ రెడ్డి, మూలం రెడ్డి రామాంజనేయుల రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.