YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మేమిచ్చింది చంద్రబాబు మరిచిపోయారు

మేమిచ్చింది చంద్రబాబు మరిచిపోయారు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

భారతీయ జనతా పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతం కావాలని బీజేపీ జాతీయ అధ్యక్షు డు అమిత్ షా పిలుపునిచ్చారు. విజయనగరం లో బిజెపి శక్తి కేంద్రాల సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న అమిత్ షా కార్యకర్తలనుద్దేశి౦చి మాట్లాడారు. రాష్ట్రంలో ఈ 5 ఏళ్ళు పాలన గమనించి ఎవరిని గెలిపించు కోవలో ఆలోచించుకోమని కార్యకర్తలకు దిశా నిర్దేశ౦ చేసారు. చంద్రబాబు చేసే దుష్ప్ర చారానికి దీటైన జవాబు తర్వాత నేను ఇస్తాన౦టూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని బాబు అబద్దాలు చెబుతున్నారన్నారు. ఏపీకి ఆర్థిక లోటుకు అదనంగా నిధులు సమకూర్చామన్నారు. ఏపీలో ఇప్పటికే ఐఐటీ, ఐఐఎంలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 20 జాతీయ సంస్థలను ఏపీకి ఇచ్చామన్నారు. ఏపీకి ఇంత వరకు రూ.5.56 లక్షల కోట్లకు పైగా ఇచ్చామన్నారు. రాయలసీమలో బాబు ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. ముందు బాబు రాజకీయ జీవితం ఏమిటో చెబుతా అని చంద్ర బాబు యూ టర్న్ ముఖ్యమంత్రి అని అభివర్ణించారు.  బాబు రాజకీయ జీవితం కాంగ్రెస్ తో ప్రారంభం అయిందని, ఎన్టీఆర్ ని మోసం చేసి టీడీపీ చేజిక్కి చుకున్నారని ఆరోపించారు. తర్వాత ఎన్డీఏ తో జత కట్టి  తర్వాత వదిలేశారని, మళ్లీ మోడీ ప్రధాన అవుతారని తెలిసి అధికారం కోసం ఎన్డీఏ తో కలిసి వచ్చారని తెలిపారు.మళ్ళీ అధికారం కోసం తెలాంగాణా ఎన్నికల్లో రాష్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ ఒడి లో కూర్చు న్నాడని,ఆ ఎన్నికల్లో దెబ్బ తగలడంతో కాంగ్రెస్ ని వదిలేసి జాతీయ పార్టీలని ఏకం చేయడానికి చూస్తున్నారని పేర్కొన్నారు.చంద్రబాబు కి బీజేపీ ద్వారాలు ముసుకు పోయాయన్నారు. మేము రాష్రానికి ఏమిచ్చామో చంద్రబాబునాయుడు మరిచిపోయి మాట్లాడుతున్నారన్నారు. విభజన బిల్లులో 14 అంశాల్లో 10 ఇప్పటికే తమ ప్రభుత్వం అమలు చేసింది. దీని పై బాబుకి సవాల్ విసిరారు. నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని బఅయన  అన్నారు. 

Related Posts