Highlights
- స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-2
- ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ప్రయోగం
- 2,000 నుంచి 2,500 కిలోమీటర్ల దూరంలోని
- లక్ష్యాలను చేధించగల సామర్థ్యం

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-2 క్షిపణిని ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి మంగళవారం ఉదయం విజయవంతంగా ప్రయోగించారు. ఈ క్షిపణి అణ్వస్త్రాలను ఉపరితలం నుంచి ఉపరితంపైకి దూసుకెళ్లి 2,000 నుంచి 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. ఇది 20 మీటర్ల పొడవు, 16 టన్నుల బరువు ఉండి, సుమారు వెయ్యి కిలోల బరువైన వార్‌హెడ్ మోసుకువెళ్లే సామర్ధ్యం కలిగింది.
అగ్ని- 2 క్షిపణిని ఇప్పటికే ఆర్మీకి అందజేశారు. తమ అణు, క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కాదని స్పష్టం చేసిన భారత్.. పాక్ నుంచి ఉన్న ప్రమాదం అనేది భద్రతా వ్యవస్థలో ఒక అంశం మాత్రమేనని ఈ సందర్భంగా పేర్కొంది.