
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
బంగారం దుకాణంలో నమ్మకం గా పనిచేస్తూ దాదాపు కోటిన్నర విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన లో నిందితుడు వివేక్ గొడవథ్ ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజరా హిల్స్ రోడ్ నెంబర్ 12 రైసన్ జువెలర్స్ లో ఏడు నెలలుగా వివేక్ సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. యజమానులను నమ్మించి డెలివరీ ఇవ్వాల్సిన ఆభరణాలను పక్కదారి పట్టించాడు. ఇలా దాదాపు 3 కిలోల బంగారు వజ్ర ఆభరణాలను ఆయన చోరీ చేశారు. ఆలస్యంగా గుర్తించిన జువెలరీ షాప్ యజమానులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసుల కు నకిలీ బిల్లులతో వివేక్ ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. అతని అదుపులోకి తీసుకొని విచారించి అతని వద్ద నుంచి మూడు కిలోల బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు కోటిన్నర ఉంటుందని వెస్ట్ జోన్ డిసిపి వి ఆర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నిందితులపై గతంలో దాదాపు ఐదు కేసులు నమోదయినట్లు వివరించారు. బంగారు దుకాణ యజమానులు ఎవరినైనా పనిలో పెట్టికునేప్పుడు ఖచ్చితంగా వారి పూర్వాపరాలు తెలుసుకోవాలన్నారు .ఈ కేసును బంజారాహిల్స్ పోలీసులు త్వరగా చేదించి పెద్ద మొత్తంలో బంగారాన్ని రికవరీ చేశారన్నారు. మరో కిలో బంగారం అతడి సోదరుడు వద్ద ఉందని అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడన్నారు. నిందితుడు వివేక్ బంగారాన్ని మనప్పురం లో తాకట్టు పెట్టారని ఈ నేపథ్యంలోనే వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు