YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పశ్చిమ బంగ ప్రభుత్వంపై సీఈసీని కలవనున్న బీజేపీ నేత

 పశ్చిమ బంగ  ప్రభుత్వంపై సీఈసీని కలవనున్న బీజేపీ నేత

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తలపెట్టే కార్యక్రమాలకు అడ్డు పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ విషయమై ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ను బీజేపీ ప్రతినిధుల బృందం కలవనుంది. అనంతరం మమత బెనర్జీ నిరంకుశ వైఖరీపై సీఈసీకి ఫిర్యదు చేస్తామని బీజేపీ నేతలు తెలిపారు. ఈ అధికారుల బృందంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ కూడా ఉన్నారని బీజేపీ నేతలు  అన్నారు. 
కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘గణతంత్ర బచావో’ ర్యాలీని నిలిపివేశారు. దీనిపై యోగి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తన చాపర్ లాండ్ అవ్వడానికి కూడా అనుమతి లేకపోవడం రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందో స్పష్టమవుతోందని యోగీ అన్నారు. ఉత్తర దినాజ్పూర్, దక్షిణ దినాజ్పూర్ జిల్లాల్లో రెండు ర్యాలీలు నిర్వహించాల్సి ఉండగా ఏ ర్యాలీకి ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయానని, చివరికి లఖ్నవూ నుంచి ఫోన్ ద్వారా ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని రాయిగంజ్ ర్యాలీకి ఫోన్ ద్వారా తాను ప్రంసంగించాల్సి వచ్చిందని యోగీ అన్నారు.
అయితే రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం రాష్ట్రంలో రెండు ర్యాలీల్లో పాల్గొన్నారు. ఠాకూర్నగర్, దుర్గాపూర్లలో నిర్వహించిన కార్యక్రమాల్లో మోదీ పాల్గొని ప్రంసంగించారు. కాగా రాష్ట్రంలో అధికారంలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తమ కార్యకర్తల్ని హత్య చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు

Related Posts