YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పలాస ఎమ్మెల్యే అరెస్ట్

 పలాస ఎమ్మెల్యే అరెస్ట్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడానికి ప్రయత్నించడం తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. అమిత్ షా బస్సు యాత్ర మరికొద్ది సమయంలో పలాస చేరుకునే క్రమంలో పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం టీడీపీ శ్రేణులు రహదారిపై బైఠాయించి అమిత్ షా గో బ్యాక్, మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయితే టీడీపీ శ్రేణులకు పోటీగా బీజేపీ కార్యకర్తలు సైతం ఆందోళనకు దిగడంతో పలాసలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు చెదరగొట్టారు. పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ సహా పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నాయకత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను సైతం ప్రధాని మోదీ నిలబెట్టుకోవడం లేదన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని నిలదీశారు. తెలుగు వాడు ఎదుగుతుండే తొక్కేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. తిత్లీ తుపానుతో కకావికలమైన ఉత్తరాంధ్ర కనీసం చూడటానికి కూడా రాని బీజేపీ పెద్దలు ఎన్నికల వేళ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో మూడు నెలల్లో దిగిపోవడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. 

Related Posts