YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కియా కార్ల కంపెనీ దగ్గర వైసీపీ ధర్నా

 కియా కార్ల కంపెనీ దగ్గర వైసీపీ ధర్నా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కియా కార్ల ఫ్యాక్టరీ ముందు వైసీపీ ధర్నా పిలుపుతో అనంతపురంలో ఉద్రిక్తత ఏర్పడింది. కియా కార్ల ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలంటూ సోమవారం.. వైసీపీ పోరుబాట పట్టింది. దీంతో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. పోరుబాట కార్యక్రమానికి సిద్ధమైన వైఎస్సార్‌సీపీ పెనుకొండ సమన్వయకర్త శంకర్‌నారాయణ్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే అనంతపురం మాజీ ఎంపీ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి, రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది పోలీసు రాజ్యమా ప్రజాస్వామ్యమా ?పోలీసుల వలయంలో కియా ఫ్యాక్టరీ ప్రస్తుతం కియా ఫ్యాక్టరీ వద్ద కాపు కాస్తున్న పోలీసులు. కనపడిన ప్రతి వ్యక్తినీ అరెస్ట్ చేస్తున్న పోలీసులు కియా కార్ల ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలంటూ,అనంతపురం పెనుకొండలో వైయస్ఆర్ కాంగ్రెస్ పోరుబాట. వైసీపీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. కొందరు ఫ్యాక్టరీవైపు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్యాక్టరీ దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు. అటువైపుగా వెళుతున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ వైసీపీ చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. అధికార పార్టీ ఆదేశాలతో వైసీపీ నేతల్ని పోలీసులు నిర్బంధించారని ఆరోపించారు. 

Related Posts