YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాబును కలుస్తున్నారు... వెళుతున్నారు... పార్టీలో ఎందుకు చేరడం లేదు

బాబును కలుస్తున్నారు... వెళుతున్నారు... పార్టీలో ఎందుకు చేరడం లేదు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తెలుగుదేశం పార్టీలో చేరికలు ఎందుకు వాయిదా పడుతున్నాయి. చేరతామన్న నేతలు చంద్రబాబును, ముఖ్యనేతలను కలసి చర్చించి వెళుతున్నా ఎందుకు చేరడం లేదు. ఇదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కీలక నేతలందరినీ తన గూటికి చేర్చుకుని పార్టీకి హైప్ తేవాలనుకుంటున్నారు. పార్టీపైనా, ప్రభుత్వంపైనా ఉన్న వ్యతిరేకతను ముఖ్య నేతలను చేర్చుకోవడం ద్వారా తుడిపేయవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసమే తాను పార్టీలోకి చేర్చుకో దలచుకున్న వారితో నిత్యం టచ్ లో ఉంటున్నారు. పార్టీ నేతలను కూడా వారి వద్దకు పంపి మంతనాలు సాగిస్తున్నారు.ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డితో చంద్రబాబు విందుసమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఫ్యామిలీతో సహా వచ్చి చంద్రబాబు ఇచ్చిన విందుకు హాజరై పార్టీలో చేరకుండా వెళ్లిపోయారు. పైగా తాను కేవలం అభివృద్ధి అంశాలు, కర్నూలు జిల్లా ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా వంటి విషయాలపైనే చర్చించానని, అంతకు మించి తమ మధ్య రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదని కోట్ల చెబుతున్నారు. పార్టీ మారుతున్న విషయంపై మీడియా తరచి అడిగినా ఆయన స్పందించలేదు. కోట్ల టీడీపీలో చేరతారన్నది ఖాయమే అయినప్పటికీ ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారు.విజయవాడకు చెందిన వంగవీటి రాధా కూడా అంతే. వంగవీటి రాధా నేరుగా చంద్రబాబును కలవక పోయినా టీడీపీ నేతలు వచ్చి రాధాతో చర్చలు జరిపి వెళ్లిపోయారు. రాధా టీడీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారని టీడీపీ నేతలు బయటకు వచ్చి మీడియాకు చెప్పారు. డేట్ కూడా లీక్ చేశారు. అయితే రాధా ఇంతవరకూ టీడీపీ కండువా కప్పుకోలేదు. దీనికి అనేక వదంతులు షికార్లు చేస్తున్నాయి. రాధా మనసు మారిందని కొందరు, టీడీపీలో చేరవద్దని అనుచరుల నుంచి వస్తుందన్న ప్రచారం కూడా జరుగుతోంది.గత కొన్నాళ్లుగా టీడీపీలో చేరతారని భావిస్తున్న ఉత్తరాంధ్ర నేతలు సబ్బం హరి, కొణతాల రామకృష్ణ, డీఎల్ రవీంద్రారెడ్డి వంటి వారు కూడా ఇప్పటి వరకూ పార్టీలో చేరేలేదు. సబ్బం హరి ఇప్పటికే టీడీపీ అధినేతతో టచ్ లో ఉన్నప్పటికీ ఆయన కండువా కప్పుకునేందుకు వెనకాడుతున్నారు. కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రదరావుదీ అదే పరిస్థితి. అయితే దీనికంతటికీ కారణం అమావాస్య మాత్రమేనని చెబుతున్నారు. ప్రస్తుతం అమావాస్య ఉందని, ఫిబ్రవరి నాలుగు తర్వాతే మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెప్పడంతో ఈ నేతలందరూ ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు. మొత్తం మీద నేతల చేరికకు అమావాస్య అడ్డొచ్చిందన్న మాట.

Related Posts