YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

30 ఏళ్ల నుంచి సీట్ల దూరంగా సామాజిక వర్గం

30 ఏళ్ల నుంచి సీట్ల దూరంగా సామాజిక వర్గం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

విశాఖ అంటేనే అన్ని కులాలు, మతాలా సమాహారం. ఓ విధంగా మినీ ఇండియాగా చెప్పాలి. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడ ఉంటారు. ఉద్యోగం నిమిత్తం, వ్యాపారం కోసం విశాఖకు వచ్చినవారు వేలల్లో, లక్షల్లో ఉన్నారు. అందువల్ల విశాఖ స్థానికత ఎపుడూ ప్రమాదంలో పడుతూనే ఉంది. ముఖ్యంగా ఎన్నికలు వచ్చినపుడు అది బాగా ఎక్కువగా ప్రస్తావనకు వస్తోంది. విశాఖ ఎంపీ, ఎమ్మెల్యే వంటి సీట్లకు ఇక్కడకు వలస వచ్చిన నాయకులు పోటీ చేస్తూంటే స్థానికంగా ఉన్న వారు కలత చెందుతున్నారు. పార్టీలు కూడా అలాగే ప్రోత్సహిస్తున్నాయు. అర్ధబలం, అంగబలం అంటూ పారామీటర్లు పెట్టి మరీ నాన్ లోకల్ క్యాండిడేట్లను నెత్తిన రుద్దుతున్నాయి.ఇక విశాఖ ఎంపీ సీటు విషయానికి వస్తే మొదట బ్రాహ్మణులే గెలుస్తూ ఉండేవారు. తెన్నేటి విశ్వనాధం వంటి స్వాతంత్ర సమరయోధులు ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచి డిల్లీలో సత్తా చాటారు. 1952లో జరిగిన తొలి ఎన్నికలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లంకా సుందరం గెలిచి సత్తా చాటారు. ఆ తరువాత తెన్నేటి విశ్వనాధం, ద్రోణం రాజు సత్యనారాయణ, భాట్టం శ్రీరామమూర్తి వంటి వారు ఆ సామజిక వర్గం నుంచి ఎంపీలు అయ్యారు. విశాఖ పార్లమెంట్ పరిధిలో రెండు లక్షల మంది వరకూ బ్రాహ్మణ వర్గం ఓట్లు ఉన్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే గెలిచిన చరిత్ర ఉంది. కానీ గత ముప్పయ్యేళ్ళుగా ఆ సామాజికవర్గాన్ని పక్కన పెట్టారన్న ఆవేదన వారిలోఉంది.ఎన్నికల్లో సీట్లు, పదవులు ఇవ్వకపోయినా ఓట్ల కోసం మాత్రం బ్రాహ్మణులకు గేలం వేయడం పార్టీలకు అలవాటుగా మారింది. దాదాపు రెండు దశాబ్దాలుగా విశాఖ ఎంపీ సీటు నుంచి గెలవలేకపోతున్న టీడీపీ ఈసారి ఎలగైనా సీటు కొట్టాలనుకుంటోంది. దాంతో బ్రాహ్మణుల మద్దతు అవసరమవుతోంది. బీజేపీ నుంచి సీనియర్ నేత, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన చెరువు రామకోటయ్యను టీడీపీలోకి తీసుకున్న తరువాత ఆయనకు దేవాదాయ శాఖ సలహాదారు పదవిని నామినేటెడ్ పొస్ట్ గా ఇచ్చారు. రేపటి రోజున ఆయన ద్వారా ఓట్ల పంట పండిచుకోవాలని టీడీపీ చూస్తోంది.ఎమ్మెల్యే, ఎంపీ వంటి పదవులతో పాటు, ఎమ్మెల్సీ కూడా ఇవ్వకుండా కేవలం ఓట్ల కోసం ఏదో చిన్న పదవి ఇచ్చి గెలవాలనుకుంటే కష్టమని బ్రాహ్మణ నాయకులు అంటున్నారు. ఇక కనీసం ఎమ్మెల్యే టికెట్ అయినా, కుదరకపోతే ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసారి బ్రాహ్మణుల ఓట్లు ఎవరికి పడతాయో చూడాలి. తమను రాజకీయంగా శక్తిగా గుర్తించి గౌరవించిన పార్టీలకే తమ ఓటు అని ఆ వర్గం చెబుతోంది. ఈ మేరకు విశాఖలో ఉన్న బ్రాహ్మణ సంఘాల నేతలు కూడా సమావేశాలు జరుపుతున్నారు. మొత్తం ఓట్లలో పది శాతం వరకూ ఉన్న ఈ వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడం పైనే ఇపుడు ప్రధాన రాజకీయ పార్టీల గెలుపు ఆధారపడి ఉంది.

Related Posts