YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇక ఆన్ లైన్ లో ఇసుక

ఇక ఆన్ లైన్ లో ఇసుక

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఇసుక.. ఇప్పటివరకూ జిల్లాలో ఇదో మాఫియా. దీన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్కులు సర్కారు ఆదాయానికి గండి కొట్టి కోట్లు గడించారు. దీన్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా శాండ్ ట్యాక్స్ పాలసీని అమలులోకి తెచ్చింది. దీంతో అక్రమార్కుల ఆటలకు చెక్ పడటంతో పాటు గుర్తించిన ఇసుక రీచ్‌ల ద్వారా సర్కారు ఖజానాకు సొమ్ము చేరనుందిదళారులను ఆశ్రయించకుండా నేరుగా ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా ఇసుక పాలసీ రూపొందించింది. దీంతో అడ్డదారిలో ఇసుక తవ్వి దందా నడిపే దళారులకు చెక్ పడడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరనున్నది. ఫిబ్రవరి 11నుంచి నూతన పాలసీ అమలుకానుండగా.. జిల్లా మైనింగ్ యంత్రాంగం తొమ్మిది మండలాల్లోని 30క్వారీల్లో 4.56లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. ఇసుకను తరలించే ట్రాక్టర్లు దారిమళ్లకుండా జీపీఎస్ అనుసంధానం చేయనున్నారు. మరోవైపు ఇసుక క్వారీల్లో యంత్రాలకు బదులు కూలీలకు ఉపాధి కల్పించనున్నారు. నూతన ఇసుక పాలసీ ద్వారా 5కి.మీ దూరానికి రూ.1535.80, 50కి.మీ దూరానికి రూ.4010.80 చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు సైతం ఇసుక కోసం తిప్పలు పడకుండా కనీస ధరలకే పొందే విధంగా చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి ఆదేశాలు ఇప్పటికే జిల్లా మైనింగ్ యంత్రాంగానికి అందగా ఫిబ్రవరి 11 నుంచి అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నూతన నల్లగొండ జిల్లాలో 9మండలాల్లో ఉన్న రీచ్‌లను ప్రాథమికంగా గుర్తించిన అధికారులు తొలిదఫా ఈ రీచ్‌ల్లో ఇసుకను తోడనున్నారు. డిమాండ్‌ను బట్టి మిగిలిన ప్రాంతాల్లోనూ ఇసుకను తవ్వి వినియోగదారులకు అందించే విధంగా చర్యలు జరుగుతున్నాయి. ఇసుక కోసం ఇక తిప్పలు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వారికి శుభవార్తను అందించిన సర్కారు ఇక ఫిబ్రవరి 11 నుంచి ఆన్‌లైన్ ద్వారా ఇసుక అమ్మకాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ఇసుక విక్రయాలకు సర్కారు వెర్‌టోనిక్స్ అనే ఏజెన్సీకి కాంట్రాక్టునిచ్చింది. వినియోగదారులు ఇసుక కావాలనుకుంటే నెట్ లేదంటే మొబైల్, మీ సేవలో www.sandtaxi. com వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలి. ఈ బుకింగ్‌కు సంబంధించిన సమాచారం ఆ ఏజెన్సీకి వెళుతుంది. ఆ ఏజెన్సీ ద్వారా గుర్తించిన రీచ్‌ల్లో శాండ్‌రిచ్ ఆఫీసర్‌గా వ్యవహరించేటు వీఆర్‌ఓకు సమాచారం వెళుతుంది. అక్కడ వీఆర్‌ఓలు శాండ్‌ట్యాక్స్ పాలసీలో కాంట్రాక్టు తీసుకున్న ట్రాక్టర్ల ద్వారా వినియోగదారులకు ఇసుకను పంపిస్తారు. ఈ ట్రాక్టర్‌కు ఒక డివైజ్‌ను అమర్చి ఉండటం వల్ల ఏ ప్రాంతానికి వెళుతుందనేది తెలిసిపోతుంది. వినియోగదారులు బుక్ చేసిన నాటి నుంచి డెలీవరీ వరకు ఎప్పటికప్పుడు ఆయా స్టేజీలను బట్టి సమాచారం తన మొబైల్‌కు వెళుతుంది. ట్రాక్టర్‌కు జీపీఎస్ అనుసంధానం చేయడంతో అక్రమాలు జరగకుండా నేరుగా ఇసుక వినియోగదారుని ఇంటికి వెళుతుంది.ప్రభుత్వం గుర్తించిన రీచ్‌లలో ఇసుకను ఎత్తడానికి ఎలాంటి మిషనరీలు వాడొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయా రీచ్‌లలో కూలీల ద్వారానే ఇసుకను ఎత్తాలని నిర్దేశించింది. ఈ పాలసీతో ప్రతి ట్రాక్టర్‌కు, కూలికి రూ.200 చొప్పున అందుతుండగా ఏజెన్సీతో పాటు ప్రభుత్వానికి ఆయా పన్నుల రూపంలో రూ.1060 వస్తోంది. అయితే ఈ విధంగా ఇసుక రవాణా చేయడానికి టిప్పర్లు, లారీలను సైతం అనుమతించడం లేదు. ఇదిలా ఉండగా రీచ్‌లు ఉన్న గ్రామ పంచాయతీలకు సైతం ప్రతి క్యూబిక్ మీటర్‌కు రూ.100 చొప్పున చెల్లించేలా సర్కారు చర్యలు తీసుకుంటుంది.

Related Posts