యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ముందుగా ఆయన విభజనాటి పరిస్థితిని తెలియజేస్తూ ఆర్థిక ఇబ్బందులను, సంక్షోభాలను ఎదుర్కొన్నామని అన్నారు. రూ.2.2677.53 కోట్లతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. రైతుల కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని మంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవకు రూ. 5 వేల కోట్లు కేటాయించారు. అలాగే పలు కొత్త పథకాలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం సంక్షేమ పథకాలకు 65,486 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. యనమల మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్రాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తున్నదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేస్తున్నామని అన్నారు. నదుల అనుసంధానంలో ఏపీని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపామని అన్నారు. అలాగే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలను ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిపామన్నారు. ఇందులో ఆయా రంగాలకు ప్రభుత్వం కేటాయించిన నిధులు : వ్యవసాయానికి రూ. 12, 732 కోట్లు బీసీ వెల్ఫేర్ రూ.8,242 అటవీపర్యావరణానికి రూ. 491 కోట్లు ఉన్నత విద్య- 3,171 కోట్లు ఇంధన మరియు ఇన్ఫ్రాస్ట్రక్షర్ రూ.5,473 సెకండరీ ఎడ్యుకేషన్ రూ. 22,783 పౌరసరఫరాలు- రూ. 3,763 కోట్లు, ఆర్థికశాఖకు రూ. 51, 841 కోట్లు, , సాధారణపరిపాలన శాఖకు- రూ.1,117, వైద్యారోగ్యశాఖకు రూ. 10,032, హోంశాఖకు రూ.6,397 కోట్లు, గృహనిర్మాణశాఖకు రూ.4079, జలవనరులశాఖకు- రూ. 16,852 కోట్లు, పరిశ్రమలశాఖకు 4,114 కోట్లు, ఐటీకి 1006 కోట్లు, కార్మిక ఉపాధి కల్పనకు 1225 కోట్లు, న్యాయశాఖకు 918 కోట్లు, అసెంబ్లీకి 149 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు 7979 కోట్లు, మైనార్టీ వెల్ఫేర్‌కు రూ. 1308 కోట్లు, ప్లానింగ్‌కు 1403 కోట్లు. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ రూ. 35,182 కోట్లు, రెవెన్యూశాఖకు రూ. 5546 కోట్లు. రియల్ టైమ్ గవర్నెన్స్ 172 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ 458 కోట్లు, సోషల్ వెల్ఫేర్‌కు రూ. 6861 కోట్లు, రోడ్లు భవనాలశాఖకు రూ. 5382 కోట్లు, మహిళాశిశు సంక్షేమశాఖకు రూ. 3408 కోట్లు. యువజన క్రీడలు రూ. 1982 కోట్లు, రెవెన్యూశాఖకు రూ. 5546 కోట్లు, రియల్ టైమ్ గవర్నెన్స్ 172 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ 458 కోట్లు, సోషల్ వెల్ఫేర్‌కు రూ. 6861 కోట్లు, రోడ్లు భవనాలశాఖకు రూ. 5382 కోట్లు, మహిళాశిశు సంక్షేమశాఖకు రూ. 3408 కోట్లు, యువజన క్రీడలు రూ. 1982 కోట్లు, ప్రభుత్వం పలు కొత్త పథకాలకు నిధులు మంజూరు చేసింది. చిన్నమధ్యతరహా పరిశ్రమలకు రూ. 400 కోట్లు, డ్రైవర్ సాధికార సంస్థకు రూ. 150 కోట్లు, క్షత్రియ కార్పొరేషన్‌కు రూ. 50 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ. 1000 కోట్లు, యాంత్రీకరణకు రూ. 300 కోట్లు, మత్స్యశాఖ అభివృద్ధికి రూ. 100 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ. 14,367 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ. 5,385 కోట్లు, బీసీ సబ్‌ప్లాన్ కింద రూ. 16,226 కోట్లు, మైనార్టీ సబ్‌ప్లాన్ కింద రూ. 1,304 కోట్లు, పసుపు- కుంకుమ కింద రూ. 4 వేల కోట్లు, బీసీల కార్పొరేషన్‌కు రూ. 3 వేల కోట్లు, ముఖ్యమంత్రి యువనేస్తానికి రూ. 1200 కోట్లు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ. 1100 కోట్లు, చంద్రన్న బీమాకు రూ. 354 కోట్లు, అన్నా క్యాంటీన్లకు రూ. 300 కోట్లు, చేనేతలకు రూ. 225 కోట్లు, 9,10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి రూ. 156 కోట్లు, చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు రూ. 175 కోట్లు, చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ. 128 కోట్లు, మైనార్టీలకు దుల్హన్ పథకం కింద రూ. 100 కోట్లు, ఎన్టీఆర్ విదేశీ విద్యకు రూ. 100 కోట్లు
పెన్షన్ కింద వృద్ధాప్య, వింతంతువులకు రూ. 10,401 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి హోదాలో యనమల అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇది 11వ సారి.