యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం పొలాల్లో చిరుత ఇంకా అలజడి రేపుదోంది.
సమీప అరటి, కోకో తోటల్లో దాగివుందని రైతులు అనుమానిస్తున్నారు. బుధవారం ఉదయం పొలంలో నీరు పెడుతున్న రైతుకు కనబడినట్టు స్థానికులు చెబుతున్నారు. అటవీశాఖాధికారులు నిర్లక్ష్యం వల్లే చిరుత పారిపోయిందని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఆరుగురని గాయాపరిచిన చిరుత భయంతో పొలాల్లోకి వెళ్ళలేక రైతుల బిక్కుబిక్కుమంటున్నారు. చిరుత రాకుండా చేయాలని కత్తులు, కర్రలతో పొలం గట్లపై తిరుగుతున్నారు. తోటల్లో కాకులు గుంపులుగా తిరగడంతో అక్కడే నక్కివుంటుందని అనుమానిస్తున్నారు. రాత్రి ఫ్లడ్ లైట్లు ఆర్పివేయడంతోనే చిరుత తప్పించుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.