YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

గీతాంజలి జెమ్స్‌ ఉద్యోగులకు కష్టాలు 

 గీతాంజలి జెమ్స్‌ ఉద్యోగులకు కష్టాలు 


పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో పాల్పడిన రూ.11,400 కోట్ల కుంభకోణంతో గీతాంజలి జెమ్స్‌ ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. నీరవ్‌ మోదీ అంకుల్‌ మెహుల్‌ చౌక్సికి చెందిన ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను రిలీవింగ్‌ లెటర్లు తీసుకోవాలంటూ గీతాంజలి జెమ్స్‌ కోరింది. ఈ నేపథ్యంలో గీతాంజలి జెమ్స్‌ను మూసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో పాల్పడిన రూ.11,400 కోట్ల కుంభకోణంలో నీరవ్‌ మోదీ, ఆయన అంకుల్‌ మెహుల్‌ చౌక్సిలు ప్రధాన పాత్రదారులుగా ఉన్నారు. ఈ స్కాం వెలుగులోకి రాకముందే నీరవ్‌ మోదీ, చౌక్సి దేశం విడిచి పారిపోయారు. ఇది ఇలా ఉండగా  పీఎన్‌బీ మోసంలో చౌక్సి ప్రమేయాన్ని గీతాంజలి జెమ్స్‌ ఖండిస్తోంది. చౌక్సికి వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 
 

Related Posts