యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ప్రభుత్వ రంగ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (భెల్) తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికపు (క్యూ3, అక్టోబర్-డిసెంబర్) ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. కంపెనీ స్టాండలోన్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 25.3 శాతం, త్రైమాసికం పరంగా 3.66 శాతం ఎగసింది. రూ.192 కోట్లుగా నమోదయ్యింది. మార్కెట్ వర్గాలు కంపెనీ ఆదాయం రూ.239 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశాయి. అంటే భెల్ క్యూ3 లాభం మార్కెట్ అంచనాలు అందుకోలేదు. కాగా కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.153 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ స్టాండలోన్ ఆదాయం ప్రస్తుత క్యూ3లో రూ.7,562.9 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.6,834 కోట్లుగా నమోదయ్యింది. అంటే వార్షిక ప్రాతిపదికన ఆదాయం 11 శాతం మేర ఎగసింది. కంపెనీ అలాగే రూ.2 ముఖవిలువ కలిగిన షేరుకు 80 పైసల మధ్యంతర డివిడెండ్ కూడా ప్రకటించింది. భెల్ కంపెనీ నికర లాభం పెరిగినా కూడా షేరు ధర మాత్రం పతనమైంది. భెల్ షేరు ధర ఇంట్రాడేలో ఒకానొక సమయంలో 11 శాతం మేర పతనమైంది. రూ.57.9కు క్షీణించింది